ఆంధ్రప్రదేశ్ లో గత టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పని చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ఏపీ హైకోర్టు తెలిపింది. అయితే, ఏబీని రెండోసారి సస్పెండ్ చేయడం చెల్లదంటూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ ఉత్తర్వుల్ని ఉన్నత న్యాయస్థానం సమర్దించింది.
పల్నాడు జిల్లాను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లా పల్నాడు అంటూ పేర్కొనింది. పల్నాడు ప్రాంతానికి మంచి పేరు ఉంది, దానిని మీరు చెడగొట్టొద్దు అని చెప్పుకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న ( గురువారం) మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సందర్భంగా తనపై నమోదైన కేసుల్లో విచారణ అధికారులను వెంటనే మార్చాలంటూ న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు.
జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద, కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే దారుల వెంట సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. రేపు(శుక్రవారం) ఉదయం అమిత్షా శ్రీవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం తిరుమల నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఏలూరులో జిల్లా సత్రంపాడులో ఓ ప్రేమోన్మాది యువతి గొంతుకోసి హత్యకు పాల్పడి.. ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఏలూరులో యువతి గొంతుకోసి ఆత్మహత్యకు పాల్పడిన యేసు రత్నం చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.