సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబు అడ్డదారిలో పట్టు నిలుపుకోవాలి అనుకుంటున్నారు. ఈసీ, ఎన్డీయే కూటమి ఏ విధంగా అన్యాయంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసు అన్నారు. ప్రజా తీర్పు వైసీపీకి అనుకుంలాగా ఉంది.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో గందరగోళానికి గురి చేస్తున్నారు జాగ్రత్తగా చూడాలి అని సూచించారు.
ఏపీ ఈసెట్ 2024 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. అనంతపురం- జేఎన్టీయూలో ఈ సెట్ ఛైర్మన్ శ్రీనివాసరావు, కన్వీనర్ భానుమూర్తి, అధికారులు కలిసి ఈ ఫలితాలను విడుదల చేశారు.
విజయవాడలో కలుషిత నీరు అధికారులకు బిగ్ టాస్క్ గా మారింది. కొండ ప్రాంతాలలోని ప్రజలు మున్సిపల్ వాటర్ త్రాగవద్దని దండోరా వేయిస్తున్నారు. సింగ్ నగర్, పాయకాపురం, భవానీపురం, సితారా సెంటర్, ఇంకా పలు ప్రాంతాలలో కలుషిత నీటి బాధితులు ఆరుగురు.. కొత్త ప్రభుత్వాసుపత్రిలో చేరారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన్ని డీజీపీ ఆఫీసుకి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రగిరిలో ఎన్నికల పోలింగ్, ఆ తర్వాత జరిగిన ఘటనలపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు వైసీపీ, టీడీపీ పార్టీల అధినేతలు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో హింసాత్మక ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
అమిత్ షా నేడు ( గురువారం) రాష్ట్రానికి రాబోతున్నారు. ఇప్పటికే ఎన్నికల పోలింగ్ కు ముందు ప్రచారం చేసి వెళ్లిన ఆయన ఫలితాలకు ముందు మరోసారి వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో జనాలు ఎండ తీవ్రతతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది. మే 29-30 మధ్య ఎప్పుడైనా రుతుపవనాలు భారత సరిహద్దులోకి ప్రవేశించవచ్చని పేర్కొంది. అంటే రాబోవు 24 గంటల్లో రుతుపవనాలు కేరళకు చేరుకోవచ్చు.