వైసీపీ లీడర్లు... కేడర్ తో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక సమావేశానికి సిద్ధమయ్యారు.. తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కేంద్రంగా ఎమ్మెల్సీలు మినహా అందరితో కలసి ఓ జంబో మీటింగ్ అరేంజ్ చేశారు జగన్.. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు.. మెడికల్ కళాశాలల ప్రవేటీకరణపై వైసీపీ ఆందోళనల నడుమ ముఖ్య నేతలందరితో జగన్ ఏర్పాటు చేసిన కీలక సమావేశం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా…
ప్రకాశం జిల్లా మరోసారి భూ ప్రకంపనలతో ఉలిక్కిపడింది.. ఒంగోలులో అర్ధరాత్రి సమయంలో స్వల్పంగా కంపించింది భూమి.. రాత్రి 2 గంటల సమయంలో 2 సెకన్ల పాటు భూమి కంపించినట్టు చెబుతున్నారు..
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంపీ మిథున్ రెడ్డి సోదరుడి లాంటివారు.. ఎప్పుడూ నేనున్నానంటూ.. వెంటే ఉంటారని.. ఆ కక్ష తోనే కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది.. కొమ్మలను నరికిస్తే చెట్టు బలహీనమవుతుందనే మిథున్ రెడ్డిని ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారని ఆరోపించారు మదనపల్లి వైసీపీ ఇంఛార్జ్ నిస్సార్ అహ్మద్.
ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. దివ్య మంగళ స్వరూపుడై.. రకరకాల రూపాల్లో తనకిష్టమైన వాహనాలపై ఊరేగుతూ అభయాన్ని ప్రసాదిస్తుంటే ఆ భాగ్యాన్ని వర్ణించతరమా?. కేవలం బ్రహ్మోత్సవాలకు మాత్రమే ఆవిష్కృతమయ్యే అద్భుతం ఇది. రేపటి నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. ఇవాళ రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు..
ఇసుక మాఫియా దందాకు ఏడుగురు బలయ్యారు. మూడు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చిన్నారులు అనాథలుగా మారారు. ఇంత జరిగినా ప్రమాదానికి కారకులైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదు. పైగా సిల్లీ రీజన్స్తో కేసు పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకూ నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతోంది.
మరో వాన గండం ఉందంటూ వాతావరణశాఖ అలర్ట్ చేసింది. ఈ నెల 25న తూర్పు మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తాతో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.