YS Jagan: రాష్ట్ర ప్రయోజనాలపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు..
- ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై వైఎస్ జగన్ ఫైర్..
- రాష్ట్ర ప్రయోజనాలపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు..
- ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం అడుగులేస్తుంది..
- చంద్రబాబుకు చీమ కుట్టినట్లు కూడా లేదు..
- ఏపీలో ఎన్నో ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదం ఉంది..
- రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకపోతే చంద్రబాబు ఎందుకు: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: రాష్ట్ర ప్రయోజనాలను సీఎం చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశారు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం ఏ కోశానా మీలో కనిపించడంలేదు.. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకాచకా అడుగులేస్తుంటే, ఎత్తు పెంచడానికి ఆ రాష్ట్ర కేబినెట్లో ఆమోదం తెలుపుకుంటే, కనీసం మీకు చీమకుట్టినట్టైనా లేదు అని విమర్శించారు. అనేక ప్రాంతాలు సాగునీరు, తాగునీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నా సరే మీరెందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు? అని ప్రశ్నించారు. రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన స్థానంలో ఉన్న మీరే, రాష్ట్రాన్ని ఈ రకంగా దెబ్బతీస్తుంటే ఎలా?.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు ఆ పదవి? అని వైఎస్ జగన్ ఆగ్రహ వ్యక్తం చేశారు.
Read Also: Sujeeth: ఆ సినిమాతోనే నా ప్రయాణం మొదలు.. ‘జానీ’ లేకపోతే నేను లేను
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
ఇక, గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణాజలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది అని మాజీ సీఎం జగన్ అన్నారు. 1995లో ఆల్మట్టి ఎత్తు 509.016 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు నీటిని నిల్వచేయడానికి అవసరమైన పనులు, స్పిల్‌వే సహా, గేట్ల నిర్మాణ పనులు జరుగుతుంటే అప్పట్లో మీరు సీఎంగా ఉన్నా, మీ ఎంపీల బలం మీదే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నా, 1995-2004 వరకూ కేంద్రంలో చక్రం తిప్పినట్టుగా మీరు గొప్పలు చెప్పుకున్న కాలంలో, మీకున్న రాజకీయ బలాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడలేదన్నది నిజమే కదా? అని ప్రశ్నించారు. ఇక, సుప్రీంకోర్టు ఆదేశాలతో 519 మీటర్లకు పరిమితం అయినా, చివరకు మీ హయాంలోనే తాను కోరుకున్న స్థాయిలో ఆల్మట్టి స్పిల్‌వే సహా గేట్లు పెట్టేందుకు అవసరమైన పనులు అప్పటి కర్ణాకట ప్రభుత్వం పూర్తి చేసిందనేది వాస్తవం కాదా? అని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
Read Also: Off The Record: ఆ టీడీపీ నేతలు వైసీపీతో కలిసి పార్టీని తగలెట్టేస్తున్నారా?
అయితే, గడచిన రెండున్నర దశాబ్దాలుగా, వర్షాభావం నెలకొన్న సంవత్సరాల్లో ఆల్మట్టి ఎత్తు పెంపు ప్రభావం చాలా తీవ్రంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎంతగా దెబ్బతింటున్నాయో, తాగునీరు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం.. ఇవన్నీ మీ వైఫల్యాల పుణ్యమే కదా చంద్రబాబు?.. ఇప్పుడు మళ్లీ, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు.. మళ్లీ ఆల్మట్టిలో 519 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచి నీటిని నిల్వ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమయ్యింది అన్నారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని 129.72 టీఎంసీల నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెంచాలని నిర్ణయం తీసుకోవడమే కాదు, దీని కోసం రానున్న 3 ఏళ్లలో రూ.70 వేల కోట్లు ఖర్చు చేయాలని కన్నడ ప్రభుత్వం చూస్తుందన్నారు. ఇంత జరుగుతున్నా మీలో కదలిక కనిపించడం లేదు.. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో మీరు చక్రం తిప్పుతున్నారని కదా అని చంద్రబాబును ప్రశ్నించారు.
Read Also: CM Chandrababu: ఆ తల్లి చల్లని చూపు రాష్ట్రంపై ఇదే విధంగా కొనసాగాలి..
కాగా, చంద్రబాబు మీరు ఇప్పటికైనా మేలుకోండి అని వైఎస్ జగన్ సూచించారు. కేంద్ర ప్రభుత్వంలో ఎంపీల సంఖ్యాపరంగా మీకున్న బలాన్ని ఉపయోగించుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురండి అని పేర్కొన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతో పాటు, KWDT-2 విచారణపై దృష్టి పెట్టి, సమర్థవంతమైన వాదనలు వినిపించండి అన్నారు. లేదంటే భావితరాల మనసుల్లో చరిత్ర హీనుడిగా మీరు మిగిలిపోతారు అని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!