CM Revanth Reddy: వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పంజాగుట్ట చౌరస్తాలోని వైఎస్ఆర్ విగ్రహానికి ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు.
ఉచిత ఇసుకపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రేపటి నుంచి ఉచిత ఇసుక అమ్మకంప్రారంభం అవుతుందని.. 43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక సిద్ధంగా ఉందన్నారు. 3 నెలల్లో కోటి టన్నుల ఇసుకను అందించటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి పల్లా శ్రీనివాసరావు వెళ్లారు. గంటన్నర పాటు ఆత్మీయ సమావేశం సాగింది. రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ద్వారా రాష్ట్రానికి అత్యంత ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని ఇరు పార్టీ నేతలు నిర్ణయించారు.
ఎన్టీఆర్ జిల్లా, బోదవాడలోని సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై సీఎంఓ అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు.
పెట్రోల్ బంకులు ఎప్పుడూ వాహనదారులతో రద్దీగా ఉంటాయి. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు క్యూ కట్టడంతో పాటు రద్దీగా ఉన్న సమయంలో బంకుల్లో చాలా రకాల మోసాలు జరుగుతుంటాయి. కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ తక్కువగా రావడం, రీడింగ్లో మోసం, కొలతలో మోసం, నాణ్యత లేని ఇంధనం, ఎక్కువ డబ్బు తీసుకోవడం లాంటి మోసాలు ఇటీవల జరగుతున్నాయి.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి దాదాపు 15 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని సంబేపల్లి మండలంలో సర్వసభ్య సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గైర్హజర్ అయ్యారు.
Margani Bharat: రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక ఆహ్వానించ దగ్గ పరిణామం అన్నారు. ఏ ఒక్క ప్రధాన అంశానికి పరిష్కారం లభించలేదు.. నదీ జలాలకు సంబంధించి ఇప్పటికే కమిటీలు ఉన్నాయి ఇంకా కొత్త కమిటీలు దేనికి.. షీలా బిడే కమిటీని ఎందుకు మర్చిపోయారు.