Peddamma Thalli Temple: కొలిచినవారి కొంగు బంగారం పెద్దమ్మ తల్లి.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కొలువుదీరన పెద్దమ్మ తల్లి ఆలయంలో.. అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు శాకంబరి ఉత్సవాలు జరగనున్నాయి.. సామాన్యంగా.. మనందరికి తెలిసిన ప్రకారం వివిధ కూరగాలతో అలంకరించి పూజిస్తారు కనుక ఈ తల్లిని శాకాంబరీదేవి అంటారు.. ఈ విధంగా పంట తొలిదశలో ఉన్న సమయంలో అమ్మవారిని పూజించడం వలన పంటలు సమృద్ధిగా పండుతాయని, పాడిపంటలకు లోటుండదని భక్తుల విశ్వాసం.. ఆహారాన్ని లోటులేకుండా ప్రసాదించే చల్లని తల్లి ఈ శాకాంబరిదేవి శతాక్షిఅని పిలుస్తారు..
Read Also: Insta Reels: పని పక్కన పడేసి రీల్స్ చేస్తోందన్న కోపంతో భార్యను చంపిన భర్త..
ఇక, క్రోధినామ సంవత్సర ఆషాఢ శుద్ధ సప్తమి నేడు.. అనగా జులై 13వ తేదీ శనివారం మొదలై.. ఆషాఢ శుద్ధ నవమి తేదీ 15వ తేదీ సోమవారం వరకు శ్రీ పెద్దమ్మ దేవాలయంలో శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగనున్నాయి.. తొలిరోజులో భాగంగా ఈ రోజు అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు..
ఈ రోజు జరిగిన కార్యక్రమాల విషయానికి వస్తే..
* ఉదయం 3 గంటలకు శ్రీ పెద్దమ్మ వారికి అభిషేకం
* ఉదయం 6 గంటలకు దర్శనము, హారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగం
* ఉదయం 7.35 గంటలకు కీర్తిశేషులు పి. జనార్ధన్‌రెడ్డి కుటుంబ సభ్యులచే శ్రీ విఘ్నేశ్వరపూజ పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాశన, ఆచార్య, బ్రహ్మాది బుత్విగ్వరణము, కంకణ, దీక్షాధారణలు, అగ్నిమధనం, యాగశాల ప్రవేశము, ధ్వజా రోహనము, దేవతాహ్వానం, అఖండ దీపారాధన, అంకురారోపణం, వాస్తుయోగికి, క్షేత్రపాలన, నవగ్రహ, సర్వతోభద్ర, మంటపారాధనలు, కలశస్థాపన, పంచోపనిషత్, దేవపారాయణములు, అరుణపారాయణం, దేవీభాగవతము, మహావిద్య, చండీ పారాయణములు, నవగ్రహ జపము మరియు రుద్రాభిషేకములు, తీర్థప్రసాద వినియోగములు..
* మధ్యాహ్నం 1 గంటకు మహానివేదన, హారతి, మంత్రపుష్పము
* సాయంత్రం 5 గంటలకు అగ్ని ప్రతిష్టాపక, అనుష్టాన మంత్ర హవనములు, మండప దేవతా పూజలు, హారతి, మంత్ర పుష్పం తీర్థప్రసాద వినియోగములు.
* రాత్రి 8 గంటలకు హారతి, మంత్ర పుష్పము, శ్రీ పెద్దమ్మవారి ఉత్సవమూర్తి పల్లకి సేవ, తీర్థప్రసాద వినియోగములు.. ఇలా వివిధ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు..