CM Chandrababu Naidu: ఆంధ్రపదేశ్, తెలంగాణ రెండూ నాకు రెండు కళ్లు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జూబ్లీహిల్స్ లోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసం నుండి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు భారీ ర్యాలీ తో బయలు దేరారు.
Chalasani Srinivas: విజయవాడలో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వం ఏపీపై కక్ష సాధింపు చర్యలకు దిగింది అని ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆస్తులను తెలంగాణకు అప్పగించా రు.. విభజన హామీల అమలు కోసం నాటి తెలంగాణ ప్రభుత్వం కృషి చేయలేదు.. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దుర్మార్గంగా వ్యవహరించింది..
CPI Narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ఏపీ ఆస్తులు తీసుకోమని అప్పట్లో జగన్ తెలంగాణ ప్రభుత్వానికి చెప్పాడు అని గుర్తు చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ స్వాగతిస్తున్నాం.. ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం శుభ పరిణామం.. ఇది రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకొని ధోరణితో ఉండాలి..
Buddha Venkanna: గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. టీడీఆర్ బాండ్ల రూపంలో వేల కోట్లు దోచేశారు.. ఇదంతా జగన్ డైరెక్షన్లో జరిగింది అని ఆరోపించారు.
కొప్పుగుండపాలెం గ్రామానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత రాబోతున్నారు. మృతురాలి బంధువులను కలిసి పరామర్శించునున్నారు. విద్యార్థిని దారుణ హత్యకు గురవడంతో గ్రామంలో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి. నిందితుడిని తమకు అప్పగించాలంటూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ( ఆదివారం ) పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పులివేందులలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి (సోమవారం) నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రాబోతుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఈ ఉచిత ఇసుక విధానానికి సంబంధించిన కార్యాచరణను రెడీ చేశారు. ముందుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్‌ల నుంచి ఇసుకను అందిస్తారు.
Anakapalli: అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం పరిధిలోనీ కొప్పు గొండు పాలెంలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ సైకో కత్తితో దాడి చేసి హత్య చేశాడు.