Minister Atchannaidu: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతోన్న సమయంలో.. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి.. తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొనే రైతులకు క్షేత్ర స్థాయిలో సూచనలు అందించాలి.. రాష్ట్రంలో పంట నష్టం అంచనా వేయండి.. రైతు సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయండి అంటూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు..
Read Also: CM Revanth Reddy: పరీక్షలు పెట్టకుండా… వాయిదా వేస్తూపోతే వయసైపోతుంది..
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చూడాలన్న మంత్రి అచ్చెన్నాయుడు.. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ కి కీలక సూచనలు చేశారు.. ఈ రోజు రాజశేఖర్ తో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.. పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను కారణంగా పంట నష్టం అంచనా వేయాలని సూచనలు చేశారు.. జిల్లాల వారీగా వర్షపాతం ఎప్పటికప్పుడు నమోదు చేసి అందుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.. కాగా, ఏపీలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా.. పలు జిల్లాల్లో ఈ రోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన విషయం విదితమే.. మరోవైపు.. ఈ రోజు కూడా ఏపీకి వర్ష సూచన ఉందని తెలిసింది వాతావరణ శాఖ.