విశాఖలో దారుణం చోటు చేసుకుంది. గాజువాక జగ్గు జంక్షన్ సమీపంలోని శ్రీకృష్ణ నగర వద్ద వికలాంగుడు అయినా మాజీ సైనికుడు దారుణ హత్యకు గురయ్యాడు. వేటాడి వెంటాడి మరి అతి దారుణంగా కత్తులతో నరికి చంపేశారు.
తమకు తెలియకుండా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీం(జీపీఎస్) అమలు చేస్తూ గెజిట్ విడుదల చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. జీపీఎస్ గెజిట్ ఎలా విడుదలైందని సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జీపీఎస్ విధానంపై గత ప్రభుత్వ నిర్ణయాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందనే రీతిలో గెజిట్ విడుదలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలోకి వెళ్తారంటూ వచ్చిన వార్తలపై ఆయన స్వయంగా స్పందించారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను జనసేనలోకి వెళ్తున్నానంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని బాలినేని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో టీడీపీ, జనసేనలు బీజేపీతో జతకట్టడం సరికాదని సీపీఎం నేత బీవీ రాఘవులు పేర్కొన్నారు. బీజేపీది ధృతరాష్ట్ర కౌగిలి అని.. వాళ్లతో చేరినవాళ్లు దెబ్బతింటారని ఆయన అన్నారు. ఆంధ్రాలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్లు ఇదే విధంగా దెబ్బతిన్నాయన్నారు. ఇప్పుడైనా టీడీపీ, జనసేన పార్టీలు మేలుకోవాలన్నారు.
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం పాశ్చా నగరంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మరదలి రెండు నెలల పసికందును హత్య చేశాడు సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చల్లపాటి బాలాజీ అనే వ్యక్తి.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అవకతవకలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్నారు.. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగంలోని సంక్షోభం.. ఇలా వరుసగా ఇప్పటి వరకు మూడు శ్వేతపత్రాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు మరో శ్వేత పత్రం విడుదల చేశారు. అటవీ, సహజ వనరుల, భూమి, గనుల వ్యవహారంపై సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల…
ఏపీలో కేఎల్ రావు జయంతిని ఘనంగా సీఎం చంద్రబాబు మొదలుపెట్టారని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం కేఎల్ రావు జయంతి నిర్వహించలేదన్నారు. అక్రమ ఇసుక తరలించడం మీదే గత ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు, గంజాయి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి, విజయనగరంలో జరిగిన ఘటనలు అత్యంత హేయం, దారుణమని మంత్రి వ్యాఖ్యానించారు. విజయనగరంలో మైకంలో తాత వరుస వ్యక్తి చిన్నారిపై అత్యాచారం చేశాడని.. ముచ్చుమర్రిలో బాలికను హత్య చేసి రాయి కట్టి మరీ రిజర్వాయర్లోకి తోసేశారని ఆమె తెలిపారు.