వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న వారు నిల్చొవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనడంతో అసెంబ్లీలో దాదాపు 80 శాతం మంది ఎమ్మెల్యేలు.. సభలో లేచి నిల్చున్నారు.. దీంతో.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కసారిగా నవ్వులు పూశాయి..
విశాఖపట్నంలోని భీమిలి ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని పరిశీలించారు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్.. కనుమరుగైపోతున్న ఎర్రమట్టి దిబ్బలను వాటర్ మాన్ ఆఫ్ డాక్టర్ రాజేంద్ర సింగ్ పరిశీలించారు. జియో లాజికల్ సైంటిస్ట్ రాజశేఖర్ రెడ్డి, జల బిలాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ, కార్పొరేటర్ మూర్తి యాదవ్ తో కలిసి పరిశీలించారు.
సోషల్ మీడియా మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడతాం అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆడబిడ్డలను ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తే ఏం చేయొచ్చో.. చేసి చూపిస్తాం అన్నారు.. సోషల్ మీడియా ట్రోలింగ్స్ కంట్రోల్ చేయడానికి ప్రత్యేక విభాగం పెడతామని ప్రకటించారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రమాద ఘటన కేసులో విచారణ కొనసాగుతోంది. మొత్తం 2,400 రికార్డులు కాలిపోయినట్లు అధికారులు గుర్తించారు. సగం వరకు కాలిపోయిన 700 రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న పెద్దిరెడ్డి అనుచరుడు మాధవ్ రెడ్డి కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆయా ఉప నదులు కూడా జోరుగా ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదలో కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.