Fire Accident in Hospital: అర్ధరాత్రి సమయంలో ఆస్పత్రిలో రాజుకున్న అగ్గి.. తృటితో తప్పిన ఘోర ప్రమాదం
- విశాఖలో అర్ధరాత్రి తృటిలో తప్పిపోయిన ఘోర ప్రమాదం..
- వెంకోజీపాలెం మెడికవర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..
- యూపీఎస్ బ్యాటరీలు యూనిట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు.. దట్టమైన పొగ ఆసుపత్రి మొత్తం కమ్మేయడంతో రోగులు.. బంధువులు తీవ్ర భయాందోళన..
- మంటలు అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident in Hospital: విశాఖలో అర్ధరాత్రి తృటిలో ఘోర ప్రమాదం తప్పిపోయింది. వెంకోజీపాలెం మెడికవర్ ఆసుపత్రిలో అగ్గిరాజుకుంది. సెల్లార్ లోని యూపీఎస్ బ్యాటరీలు యూనిట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ ఆసుపత్రి మొత్తం కమ్మేయడంతో రోగులు, బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి ఆసుపత్రి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు పరుగులు తీశారు. మరి కొంతమందిని అద్దాలు పగలగొట్టి బయటకు తరలించేందుకు ఏర్పాటు చేశారు ఆసుపత్రి సిబ్బంది.
Read Also: Rohan Bopanna Retirement: భారత జెర్సీలో చివరి మ్యాచ్ ఆడేశా: రోహన్ బోపన్న
Also Read
- UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
- CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
- Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
- OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
సుమారు రాత్రి 11 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకోగా.. దట్టమైన పొగ కారణంగా మెడికవర్‌లో ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు ఫైరింజన్లతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన డిజాస్టర్ మేనేజ్మెంట్.. అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకురాగలిగింది. అయితే దట్టమైన పొగ మాత్రం ఆసుపత్రి వెలుపల కమ్మేయడంతో జిల్లా యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్ ను అప్రమత్తం చేసింది. ప్రత్యేక బృందాలు రంగంలోకి దగ్గర దాదాపు 5 గంటల ప్రయత్నం తర్వాత యూపీఎస్ బ్యాటరీ ఉన్న ప్రాంతాన్ని తమ కంట్రోల్ లోకి తెచ్చుకుంది రెస్క్యూ టీమ్.. ఈ ప్రమాదం వల్ల రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగలేదని, వారిని తరలించాల్సిన అవసరం లేదని నిర్ధారించుకున్న తర్వాత అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కాలంలో విశాఖలో ఆసుపత్రుల భద్రతపై చర్చ జరుగుతుండగా మెడికవర్‌లో జరిగిన ప్రమాదం రెండవది.. కొద్దిరోజుల క్రితం జగదాంబ సెంటర్లోని ఇండస్ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పలువురు అస్వస్థత గురయ్యారు. ఇప్పుడు మెడికవర్‌లో ప్రమాదం జరగా రోగుల వరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు.. దీంతో.. అంతా ఊపిరిపీల్చుకున్నారు.
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?