Varanasi: మహేష్ ‘వారణాసి’ కోసం రాజమౌళి కొత్త స్ట్రాటజీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర రికార్డులను తిరగరాసి, ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు మొదటిసారి జతకడుతున్న అద్భుత దృశ్యకావ్యం ‘వారణాసి’. అత్యున్నత సాంకేతిక విలువల తో, హాలీవుడ్ అడ్వెంచరస్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌లో మహేష్ బాబు మునుపెన్నడూ చూడని సరికొత్త మేకోవర్‌తో కనిపించబోతున్నారు. ఇందులో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది..
సాధారణంగా సినిమాల్లో షూటింగ్ అయ్యాక విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు మొదలవుతాయి. కానీ, జక్కన్న ఈ సినిమా విషయంలో రివర్స్ స్ట్రాటజీ వాడుతున్నారట. గ్లోబల్ లెవెల్‌లో విజువల్స్ అద్భుతంగా ఉండటం కోసం, టాకీ పార్ట్ కంటే ముందే VFX పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం. వీరిపై వచ్చే భారీ సీక్వెన్స్‌లకు సంబంధించి VFX గ్రౌండ్ వర్క్ ఇప్పటికే చాలా వరకు పూర్తయిందని తెలుస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎస్. కార్తికేయ, కె.ఎల్. నారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సినిమా రిలీజ్ కావడానికి ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ, ఇప్పుడే గ్లోబల్ వైడ్‌గా ప్రమోషన్స్ చేస్తుండటం సినిమాపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.
Also Read
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
- IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
తాజావార్తలు
-
IND W vs ZIM W: స్మృతి మంధాన కెప్టెన్సీలో కొత్త శకం.. జింబాబ్వేపై టాస్ గెలిచిన భారత్..
-
Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
-
Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!