NTR Bharosa Pensions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచిన పెన్షన్లను ఉదయం 6 గంటల నుంచి పంపిణీ చేయనున్నారు. రేపు (ఆగస్ట్ 1న) ఉదయం ఆరింటి నుంచి ఊరురా తిరిగి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెంచిన పెన్షన్ మొత్తాల పంపిణీలో ప్రజాప్రతినిధులు, మంత్రులు పాల్గొనాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
AP CM: ఆంధ్రప్రదేశ్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో అమెరికాకు చెందిన నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థిక వేత్త ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ భేటీ అయ్యారు.
CM Chandrababu: సాంఘీక సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆర్థికంగా అత్యంత వెనుకబాటులో ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.
Amalapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న అంబికా లాడ్జిపై పోలీసుల దాడులు నిర్వహించారు. ఆన్ లైన్ లో బెట్టింగ్ గేమ్ నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు.
Srisailam Dam: ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. దాంతో అధికారులు ఇప్పటి వరకు ఏడు గేట్లను ఎత్తి 1. 86 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి 4. 02 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది.
కర్నూలు జిల్లాలో నందికొట్కూరు మండలం బ్రహ్మణ కొట్కూరు వద్ద హంద్రీనీవా ప్రధాన కాలువను నేషనల్ హైవే కాంట్రాక్టర్ పూడ్చేశారు. శ్రీశైలం జలాశయం నిండినా హంద్రీనీవా కాలువకు నీరు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పాడింది. కర్నూలు- ఆత్మకూరు మధ్య నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా వంతెన నిర్మాణానికి హంద్రీనీవా కాలువను సదరు కాంట్రాక్టర్ పూడ్చి వేసేశారు.
Minister Ramprasad Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగింది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అని ఆరోపించారు. లక్షన్నర ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారు.. దేవాలయ, మఠం, ప్రభుత్వ భూముల దోపిడీ జరిగింది.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూ అక్రమాలకు పాల్పడింది.. వైసీపీ నేతలు భూ అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది.
AP Deputy CM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు ఊరట లభించింది. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై గుంటూరులో ఆయనపై కేసు నమోదు అయింది. ఈ
CPI Ramakrishna: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దొంగలు పడ్డారు అని ఆరోపించారు.