AP High Court: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది.. అయితే, దీనిపై పెద్ద దుమారమే రేగింది.. పీపీపీ మోడ్ అంటూనే మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయడంటూ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించింది.. ఇక, ఈ వ్యవహారం ఏపీ హైకోర్టు వరకు చేరింది.. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల అభివృద్ధిని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిల్…
CM Chandrababu: మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై దృష్టిసారించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నెల 16వ తేదీన ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు నారా లోకేష్, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. సీఎస్, డీజీపీలు సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షకు…
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో నకిలీ మధ్యం వ్యవహారం కలకలం రేపింది.. అయితే, రాష్ట్రంలో నకిలీ మద్యానికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రం అంతా కల్తీ మద్యం అంటూ ప్రజలను భయపెడుతున్నారు.. ఈ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.. అయితే, రాష్ట్రంలో మద్యం మరణాలపై విచారణ చేయాలని ఆదేశించారు.. ఇక, రాజకీయ కుట్రలతో కల్తీ మద్యం అంటూ..…
AP Power Staff JAC: విద్యుత్ యాజమాన్యాలతో విద్యుత్ JAC నాయకులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి.. దీంతో, పోరుబాటలో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు విద్యుత్ ఉద్యోగులు.. 13వ తేదీన ఛలో విజయవాడ, 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.. అయితే, సంవత్సరం నుంచి సాగుతున్న చర్చలు ఫలితం లేకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.. యాజమాన్యం కాలయాపన చేస్తోందని, సమస్యల పరిష్కారం వైపు రావడం లేదని జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.. మొండి వైఖరి ఆపాలి..…
Andhra Pradesh: పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించింది. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ను గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ విశాఖలో ఏర్పాటు చేయనుంది. రూ.87,520 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ డేటా సెంటర్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన 11వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదాన్ని తెలియచేసింది.. విశాఖలోని తర్లువాడ, అడవివరం, అచ్యుతాపురం సమీపంలోని…
Narayanaswamy vs Thomas: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే థామస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. దళితులపై కూటమీ ప్రభుత్వం దాడులు కొనసాగుతున్నాయని.. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తే దళితుడైన నాపైన అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి… ఎమ్మెల్యే థామస్ అసలు దళితుడే కాదని కోట్లాది రూపాయల ప్రకృతి సంపదను నియోజవర్గంలో దోచుకుంటున్నాడంటూ…
Red Alert: రానున్న మూడు గంటల్లో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.. ఇక,…
Pawan Kalyan: ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచన మేరకు కాకినాడ జిల్లా, ఉప్పాడ తీర ప్రాంత మత్స్సకారుల సమస్యల పరిష్కారం కోసం ఓ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. ఈ కమిటీలో పరిశ్రమల, మత్స్య శాఖల కమిషనర్లు, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ, కాకినాడ జిల్లా కలెక్టర్ ఉంటారు. వీరితోపాటు కాకినాడ జిల్లా కలెక్టర్…