CM Chandrababu: పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓడరేవులు, ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధిపై చర్చ జరిగింది. రాష్ట్రంలో ఆహారశుద్ధి, ఆక్వా రంగాల ఆధారిత ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
AP Govt: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను ఏపీ సర్కార్ రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులు ఇచ్చింది.
ఇస్రోలో పని చేసే ప్రతి సైంటిస్ట్ కు నా సెల్యూట్ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మనం సినిమా హీరోలకు కొట్టే చప్పట్లు కంటే ఇస్రో సైంటిస్టులను చప్పట్లతో ముంచెత్తాలన్నారు. ఇస్రో సైంటిస్టులు మన దేశానికి నిజమైన హీరోలు అని కొనియాడారు.
Vizag MLC Election: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లకు గడువు ముగిసింది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేవలం రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, స్వతంత్య్ర అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్లు దాఖలు చేశారు.
AP High Court: ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల కేటాయింపు జీవోను నిలిపివేస్తున్నట్లు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవోను సవాలు చేస్తూ విద్యార్థులు వేసిన పిటిషన్పై ఇవాళ (మంగళవారం) హైకోర్టులో విచారణ కొనసాగింది.
Nadendla Manohar: త్వరలోనే 41 A కింద నోటీసులు ఇచ్చి రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేసిన వారి అరెస్టులు కూడా ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఇప్పటికే 6A కింద నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు.
ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు 25వ రోజు వినతులు వెల్లువెత్తాయి. ఉండవల్లిలోని నివాసంలో జరిగే “ప్రజాదర్బార్” కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. మంత్రిని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి నారా లోకేష్.. సత్వర పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటకు చేరుకున్నారు. షార్లో నిర్వహించనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుమార్తె ఆద్యతో కలిసి పవన్ వచ్చారు. షార్లో అంతరిక్ష వారోత్సవాలకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు.