AP Govt: ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ కార్యాలయాలపై 300 మెగావాట్ల సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుపై ఒప్పందం చేసుకుంది.
Snake Enter In Bank: విశాఖ స్టీల్ ప్లాంట్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో పాము కలకలం రేపింది. బ్యాంకులో పాము కనిపించడంతో సిబ్బంది, ఖాతాదారులు కలవరపడ్డారు. వదలపూడిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో ఇవాళ జరిగిన ఈ సంఘటన చోటు చేసుకుంది.
AP Super Speciality Hospitals: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నోటీసులు ఇచ్చాయి. మా బకాయిలు మాకు ఇచ్చే వరకు ఇక ఆరోగ్యశ్రీ సేవలు నడపలేం అని వెల్లడించాయి.
Anna Canteens: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపడం కోసం కూటమి సర్కార్ మళ్ళీ అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపు అన్న కాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి.
Vijayawada Traffic: రేపు ఉదయం 9 గంటలకు ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం విజయవాడలో జరిగే 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు సహా మంత్రులు, ఇతర ముఖ్య అతిధులు హాజరుకానున్నారు.
Murder Case: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మల్కిపురం (మం) మలికిపురం గ్రామానికి చెందిన పడమటి నోబుల్ జార్జ్ గుడిమెల్లంక గ్రామానికి చెందిన భర్తను వదిలేసిన రాపాక ప్రశాంతి (వివాహిత)తో ప్రేమలో పడి గత కొంతకాలంగా సహజీవనం కొనసాగించారు.
వెయిటింగ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు షాక్ ఇచ్చారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.. వెయిటింగ్లో ఉంటూ హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండని సీనియర్ ఐపీఎస్‌లకు మెమోలు జారీ చేశారు.. ప్రతీరోజు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు డీజీపీ.
నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన యువ రైతు మహేశ్వర్ రెడ్డి(48), ప్రశాంతి(35) అనే దంపతులు అప్పుల బాధ తాళలేక పురుగు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుమారు రూ.2.5 కోట్లు దాకా అప్పు చేశారు. సదరు దంపతులకు నిఖిల్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం అవుతుందని చూపించేందుకే రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత. కర్నూలులో టీడీపీ నేత హత్య కేసులో నిందితులు ఎంతటి వారైన కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.