ఫ్రీ హోల్డ్ స్కాంలో మరో బాగోతం వెలుగులోకి వచ్చింది. ఫ్రీ హోల్డులోకి కొన్ని ప్రభుత్వ భూములు వెళ్లినట్లు మంత్రి అనగాని సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వానికి చెందిన కొన్ని భూములను కూడా గత ప్రభుత్వం ప్రీ హోల్డ్ పెట్టేశారని రెవెన్యూ యంత్రాంగం గుర్తించినట్లు వెల్లడించారు.
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
తుంగభద్ర గేటు మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. గల్లంతైన తుంగభద్ర డ్యామ్ 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నీరు పూర్తిగా వృథాకాక ముందే స్టాప్‌లాగ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు తుంగభద్ర బోర్డు, కర్ణాటక, ఏపీ అధికారులు.
పెళ్లిపేరుతో మోసం చేసిన ఓ ముఠాపై ఫిర్యాదు చేశాడు బాధితుడు. అయితే ఈ వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. బాధితుడినే ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది నకిలీ పెళ్లికూతురు. ఫోన్ చేసి వేధించాడంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఇంతకీ పెళ్లి పేరుతో మోసం ఎలా జరిగిందంటే.
మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఉదయమే ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో 15 మంది ఏసీబీ అధికారులు ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆయన ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటివరకు రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల భేటీ అయ్యారు. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించారు. గత రెండు రోజులుగా అమరావతిలో పర్యటిస్తోన్న నలుగురు సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబుతో సమావేశం అయింది.