Pawan Kalyan: నేటి నుంచి కాకినాడలోని చేబ్రోలులో ఆంధ్రప్రధేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర జనవాణి కార్యక్రమం జరగనుంది. ఇవాళ్టి (సోమవారం) నుంచి శనివారం వరకు ఉదయం 9. 30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అర్జీలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. సమస్యలు ఉన్న వారు నేరుగా హెల్ప్ డెస్క్ లో ఫిర్యాదులు ఇచ్చేలా సిబ్బందిని డిప్యూటీ సీఎం ఏర్పాటు చేశారు. అలాగే, ఉపాధి హామీ పథకంలో చేపట్టనున్న పనుల ఆమోదం కోసం ఈ నెల 23వ తేదీన చేపట్టనున్న గ్రామ సభలకు సంబంధించి పవన్ కళ్యాణ్ అధికారులతో నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది ఏయే రకాల పనులు చేపట్టాలనే దానిపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు (ఈ నెల 23న) ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించాలని పేర్కొన్నారు.
Read Also: Indra4k: మురారి రికార్డుకు ఎసరు పెడుతోన్న మెగాస్టార్ ఇంద్ర..?
ఈ మేరకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బందికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాచారం ఇచ్చారు. గ్రామ సభలకు సంబంధించి దిశా నిర్దేశం చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, జిల్లా కలెక్టర్ ఆఫీసులో జడ్పీ సీఈవోలు, డీపీవోలు, డ్వామా పీడీ, డీఎల్‌డీవోలు, డీఎల్‌పీవోలు, ఎంపీడీవో కార్యాలయాల్లో ఎంపీడీవోలు, ఈఓ పీఆర్ అండ్ ఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి పథకం ఏపీవోలు హాజరు కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.