Deputy CM Pawan Kalyan: ప్రధాని నరేంద్ర మోడీని కర్మయోగిగా చూస్తాం.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నారు కాబట్టే మోడీని కర్మయోగి అంటాం అని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, నారా లోకేష్.. పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. జీఎస్టీ సంస్కరణలు చేపట్టి ప్రధాని నరేంద్ర మోడీ సామాన్యులకు రిలీఫ్ కల్పించారని తెలిపారు పవన్ కల్యాణ్..
Read Also: High Court Telangana : జూబ్లీహిల్స్‌లో బోగస్ ఓట్లపై విచారణ.. జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు.
ఇక, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు ఉండాలని ఆకాక్షించారు పవన్ కల్యాణ్.. దీని కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని నిలబడతాం అన్నారు.. ఇబ్బందులు ఉన్నా.. ఏమున్నా తట్టుకుని నిలబడాలని సూచించిన ఆయన.. ఒక తరం కోసం ఆలోచించే నాయకులు సీఎం చంద్రబాబు అని.. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో అందరం సమష్టిగా పనిచేస్తాం.. వచ్చే తరం ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తాం అని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.. మరోవైపు, ప్రధాని మోడీ దేశాన్ని మాత్రమే కాదు.. రెండు తరాలను నడుపుతున్నారు.. దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్ భారత్ తీసుకువచ్చారని ప్రశంసించారు.. దేశ జెండా ఎంత పౌరుషంగా ఉంటుందో.. అలాగే దేశ పటాన్ని ప్రపంచపటంలో నిలబెట్టారని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ్.. ఇక, ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ సభా వేదికగా పవన్ కల్యాణ్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..