వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు.. అచ్యుతాపురం సెజ్ ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో గాయపడిన బాధితుల్ని పరామర్శించనున్నారు మాజీ సీఎం.. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి రోడ్డుమార్గాన అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించి ధైర్యాన్ని చెప్పనున్నారు..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు.. రైల్వేకోడూరు మండలంలోని మైసురావారిపల్లెలో గ్రామ సభలో పాల్గొనబోతున్నారు.. ఆ తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో దెబ్బతిన్న పులపత్తూరు గ్రామాన్ని పరిశీలించనున్నారు.. రాజంపేట మండలంలోని పులపత్తూరు గ్రామంలో అన్నమయ్య డ్యాం తెగి వరదలకు దెబ్బతిన్న గ్రామాలను పరిశీలించబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు 13 వేల 326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించబోతోంది ఏపీ సర్కార్. ఉపాధి హామీ పధకంలో ప్రతి కుటుంబానికీ సంవత్సరంలో 100 రోజుల పని దినాలను కల్పించడమే ప్రధాన లక్ష్యంగా.. ఒకే రోజున నిర్వహిస్తున్న ఈ గ్రామ సభల్లో 4 వేల 500 కోట్ల రూపాయల మేర పనులకు ఆమోదం…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో గోద్రెజ్ సంస్థ ప్రతినిధులు సమావేశం అయ్యారు.. గోద్రెజ్ సంస్థ సీఎండీ నాదిర్ గోద్రెజ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపింది.. ఏపీలో పెట్టుబడులపై సీఎంతో గోద్రెజ్ ప్రతినిధులు సమాలోచనలు చేశారు.. పెస్టిసైడ్స్ తయారీ రంగంలో రూ. 2800 కోట్ల పెట్టుబడులు పెట్టే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో కీలక చర్చలు జరిపారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు.. రైల్వేకోడూరు మండలంలోని మైసురావారిపల్లెలో గ్రామ సభలో పాల్గొననున్న ఆయన.. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో దెబ్బతిన్న పులపత్తూరు గ్రామాన్ని పరిశీలించనున్నారు..
అనధికారిక లేఅవుట్లపై కొరడా ఝలిపించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అనధికారిక లేఅవుట్ల విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి నారాయణ.. రాష్ట్రంలోని మున్సిపాల్టీల పరిధిలో అనధికారిక లేఅవుట్ల వివరాలను ప్రజల ముందు ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.