వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీఎం చంద్రబాబు నాయుడు.. అమరావతి మునిగిందా..? వీళ్లను పూడ్చాలి.. అప్పుడే బుద్ది వస్తుంది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.. ఒక్క వ్యక్తి అహంభావం వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడాలా..? ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తప్పుడు ప్రచారం చేస్తారా..? ఇలాంటి రాజకీయ నేరస్తులను.. తప్పుడు ప్రచారం చేసే వారిని సంఘ బహిష్కరణ చేయాలని కామెంట్ చేశారు..
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు కళాశాల ఘటనపై విచారణకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.. బాలికల హాస్టల్ లో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థుల ఫిర్యాదుపై దుమారం రేగిన విషయం విదితమే కాగా.. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ చేపట్టారు పోలీసులు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు లోతైన విచారణ చేపట్టారు పోలీసులు..
బుడమేరు నీరు కొల్లేరు, కృష్ణానదికి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ప్రవాహ దారిలో కాలువలు, వాగుల్లో కబ్జాలు తొలగిస్తాం. ఇలాంటి విపత్తులను అందరూ సమిష్టిగా ఎదుర్కోవాలి. వరద బాధితులు అందరికీ న్యాయం చేస్తాం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..
హైడ్రాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్ అన్నారు.. హైడ్రా లాంటి ఒక వ్యవస్థ మంచిదే అని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్..
AP Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ వరద పరిస్థితులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడం చాలా తేలిక.. కానీ, మా ప్రభుత్వం వచ్చి 100 రోజులు మాత్రమే అయింది.. బుడమేరు 90 శాతం ఆక్రమణలలో ఉంది అన్నారు. అదే శాపంగా మారి బెజవాడను వరద నీటితో నింపింది.
Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి భాతర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడుతూ.. అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ సూచించింది.
Vijayawada Floods: విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల అండగా ఉండాల్సింది పోయి.. కొందరు ప్రైవేట్ వ్యాపారులు దానికి క్యాష్ చేసుకుంటున్నారు. ఇంకా, వరద ప్రభావం నుంచి తేరుకోని విజయవాడను బుడమేరు వాగు నిండా ముంచేసింది. ఓవైపు ప్రజల ఆకలి కేకలు.. మరోవైపు వ్యాపారుల దోపడితో అల్లాడిపోతున్నారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు.