నందికొట్కూరులో మహిళ హత్య కేసులో సంచల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. నంద్యాల జిల్లాలో బిహారీ యువకుడు, మరొకరితో కలసి ఓ సస్పెక్ట్ షీట్లో ఉన్న మహిళను తుపాకీతో కాల్చి , నరికి చంపిన ఘటన సంచలనం సృష్టిస్తుండగా.. ఈ కేసులో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి..
ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు.. బెజవాడ వన్ టౌన్ పోలీసులు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. అయితే, ఈ ఘటనపై విచారణ జరపాలని ఇరిగేషన్ ఈఈ కృష్ణారావు శుక్రవారం ఫిర్యాదు చేశారు
ఆపరేషన్ బుడమేరు సక్సెస్ అయింది. బుడమేరు గండ్లను విజయవంతంగా పూడ్చివేశారు. ఇప్పటికే రెండు గండ్లను పూడ్చగా.. తాజాగా మూడో గండిని అధికారులు పూడ్చివేశారు. నాలుగు రోజులుగా గండ్ల పూడ్చివేత కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అక్కడ ఏర్పాటు చేసిన వినాయకుడి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వరద బాధితులకు చేస్తానన్న సాయం కోటి రూపాయల చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు.
ఏడో రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకునే పండుగ పూటా కూడా అవిశ్రాంతంగా పని చేస్తున్నామన్నారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని తెలిపారు
ఆంధ్రప్రదేశ్లోని బస్సు ప్రమాదం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గుమ్మలకుంట సమీపంలో పల్లె వెలుగుబస్సు బోల్తా పడింది. నల్లమాడ నుంచి అనంతపురంకు వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ మొత్తం గణేశుని నామస్మరణంతో మారుమోగుతోంది. లంబోధరుడిని వివిధ రూపాల్లో కొలువుతీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ మండపాల వద్ద విద్యుత్ కాంతుల శోభతో ప్రత్యేక కళను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు కళకళలాడుతున్నాయి.