ఏపీ వరదలు ముంచెత్తాయి.. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి.. వరదలతో అపార నష్టం జరిగింది.. అంచనా వేస్తుంటే.. నష్టం పెరిగిపోతూనే ఉంది.. ఓవైపు ప్రజల ఆస్తులు.. వాహనాలు.. పంటలు.. విద్యుత్ వ్యవస్థ.. రవాణా వ్యవస్థ.. మున్సిపల్ వ్యవస్థ.. పంచాయతీరాజ్ వ్యవస్థ.. ఇలా అనేక రకాలుగా భారీ నష్టాన్ని చవిచూడాల్సిన వచ్చింది.. అయితే, మేం ఉన్నామంటూ దాతలు ముందుకు వస్తున్నారు.. సినీ, రాజకీయ ప్రముఖులు.. ఉద్యోగులు.. సంఘాలు.. రాజకీయ పార్టీలు.. వ్యక్తులు.. సంస్థలు..…
వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు అందుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు.. సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి భారీవర్షాలు, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా కలెక్టర్లు.. అధికారులకు కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు..
వరద నీరు తగ్గటంతో ఇంటి నుంచి బయటకు భోజనాలు తెచ్చేందుకు వెళ్లిన నాగబాబు అనే యువకుడికి విద్యుత్ షాక్తో ప్రాణాలు విడిచాడు.. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వచ్చి సీపీఆర్ చేసినా నాగబాబు ప్రాణాలు కాపాడలేకపోయాడు.. రోడ్డుపై నీరు ఉండడంతో.. ఆ నీటి నుంచి ఎందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో.. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకునే దాటేందుకు ప్రయత్నించాడు నాగబాబు.. అయితే.. విద్యుత్ స్తంభానికి అప్పడికే కరెంట్ పాస్ అయి ఉందని.. స్తంభం పట్టుకున్న వెంటనే నాగబాబుకు షాక్…
సెల్ ఫోన్ దొంగలించారనే అనుమానంతో దంపతులపై కొడవలితో దాడి చేసిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం జోలపాలెంలో జరిగింది. సెల్ఫోన్ విషయంపై జరిగిన గొడవలో దంపతులపై ప్రత్యర్థి కొడవలితో దాడి చేసినట్లు తాలూకా పోలీసులు తెలిపారు.
నందిగామలో రెండు వేల రూపాయల కోసం వాగులో దూకాడు గోపీచంద్ అనే యువకుడు.. రోశయ్య అనే మరో యువకుడితో రూ.2 వేల పందెం కాసిన గోపీచంద్.. పందెంలో భాగంగా నందిగామ పెద్ద బ్రిడ్జిపై నుంచి నీటిలో దూకాడు.. కానీ.. తిరిగి రాలేదు.
ఏపీలో అంతకంతకు పెరుగుతోంది వరద నష్టం. ప్రాథమిక అంచనా ప్రకారమే రూ. 6882 కోట్ల మేర నష్టం వాటిలినట్టు కేంద్రానికి ఏపీ సర్కార్ ఇప్పటికే నివేదిక పంపింది.. మరోవైపు.. వ్యవసాయం, ఉద్యాన పంటలు సహా రోడ్లు, ఇతర ఆస్తి నష్టాలపై పూర్తి స్థాయి నివేదిక కోసం ఎన్యూమరేషన్ కొనసాగుతోంది.. ఇప్పటికే 46 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు.. ఇక, అంతకంతకు వ్యవసాయ, ఆస్తి నష్టం అంచనాలు పెరిగిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రతి ఇంటికీ జరిగిన డ్యామేజ్…
బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది.. బుడలేరు వరదకు దాదాపు 20 డ్రెయిన్ ల నుంచి వచ్చే వర్షం నీరు తోడు కావడంతో కొల్లేరు సరస్సులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.. ఇప్పటికే ఏలూరు రూరల్ పరిధిలోని గుడివాకలంక, పత్తికోళ్లంక, మొండికోడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా.. మండవల్లి గ్రామంలో పెనుమాకలంక, మణుగూరు వంటి 9 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి..
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు గ్రామానికి వరద తాకిడి ఎక్కువైంది, చింతూరు వద్ద శభరి నది ప్రమాదకరస్థాయిలో 45 అడుగులతో ఉరకలు వేస్తుండగా, కూనవరం వద్ద శబరి 38 అడుగులకు పెరిగింది. చింతూరు మెయిన్ సెంటర్లోకి వరద నీటి ప్రవాహం చేరడంతో ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.