ఏలేరు వరద ఉధృతి ఆందోళన కలిగిస్తోంది.. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం.. అన్ని రకాలుగా సన్నద్ధమైన విషయం విదితమే.. కాగా, ఏలేరు వరద ఉధృతిపై కాకినాడ కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు ఆర్మీ బృందాల సేవలను కూడా వినియోగించుకొని ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.. నివాస సముదాయాలను వరద చుట్టుముట్టిన చోట్ల అక్కడి ప్రజలకు తగిన ఆహారం, నీరు, పాలు అందించాలని ఆదేశించారు..…
వరద సాయం ప్యాకేజీకి అవసరమైన నిధుల సమీకరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. వరద సాయంపై కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది ఏపీ సర్కార్. వరద నష్టంపై అంచనా పనులు చేపడుతూనే.. జరిగిన నష్టాన్ని కేంద్ర పెద్దలకు వివరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం..
తిరుపతిలో వినాయక చవితి ఉత్సవాలలో రికార్డింగ్ డాన్స్, అశ్లీల నృత్య ప్రదర్శనలు చేశారు.. అయితే, దీనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. అంతేకాదు.. 7 మంది నిర్వాహకులను అరెస్టు చేశారు అలిపిరి పోలీసులు..
AP Deputy CM: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది.. అయితే, ఈ రోజు సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో సీఎం పర్యటించాల్సి ఉండగా.. అక్కడహెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి అనువుగా లేకపోవడతో పర్యటనలో మార్పు చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ఏడుగురి దుర్మరణం చెందారు.. దీంతో.. దేవరపల్లి, ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే రహదారి రక్తసిక్తమైంది.. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీలారీ రూపంలో మృత్యువు ఏడుగురిని బలితీసుకుంది.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
వదర బాధితులకు సాయం అందించేందుకు దాతలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేసి దాతృత్వం చాటుకుంటున్నారు.
కృష్ణానదిలో భారీ వరలు.. విజయవాడ అతలాకుతలం అవుతోన్న సమయంలో ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం సంచలనంగా మారింది.. అయితే, దీని వెనుక కుట్ర కోణం ఉందంటూ అధికార కూటమి నేతలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.. ఇక, ఈ ఘటనపై సంచలన ఆరోపణలు చేశారు హోం మంత్రి అనిత.. ప్రకాశం బ్యారేజ్ కుల్చివేతకు కుట్ర పన్నిన జగన్మోహన్రెడ్డి, అందుకు సహరించిన వాళ్లపై దేశ ద్రోహం కేసు పెట్టాలని కోరారు..