Nitish Kumar: చిన్న పిల్లోడివి గొడవ చేయకుండా కూర్చో.. రబ్రీ దేవీ, తేజస్వి యాదవ్‌పై నితీష్ కుమార్ సీరియస్
- హాట్‌హాట్‌గా బీహార్ అసెంబ్లీ సమావేశాలు
- లాలూ కుటుంబంపై నితీష్ కుమార్ ఆగ్రహం
- రబ్రీ దేవీ, తేజస్వి యాదవ్‌పై వ్యక్తిగత దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. ఇక రబ్రీ దేవీ, తేజస్వి యాదవ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాటల దాడి చేశారు. రబ్రీ దేవిని అమ్మాయిగా చిత్రీకరిస్తూ మాట్లాడగా… తేజస్వి యాదవ్‌ను చిన్నపిల్లోడిగా సంబోధిస్తూ డైలాగ్ వార్ చేశారు.
సోమవారం బడ్జెట్ ప్రసంగంపై మాట్లాడుతుండగా లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై నితీష్ కుమార్ వ్యక్తిగత దూషణలకు దిగారు. శాసనమండలిలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ రబ్రీ దేవీ లేవనెత్తారు. తక్షణమే నితీష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతే నితీష్ కుమార్‌కు కోపం కట్టలు తెంచుకుంది. సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి.. రబ్రీ దేవి వైపు వేలు చూపిస్తూ ఆమెను లాలూ తొలగించారంటూ వ్యాఖ్యానించారు.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ఇక అసెంబ్లీలో కూడా అదే మాదిరిగా ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌పై కూడా మండిపడ్డారు. ‘‘ముందు వినండి.. నువ్వు చిన్న పిల్లాడివి.. కూర్చో.. గొడవ చేయకు. ఏయ్..కూర్చో.’’ అని సంబోధించారు. నితీష్ కుమార్ వ్యాఖ్యలను లైట్ తీసుకున్నారో.. ఏమో తెలియదు గానీ.. తేజస్వి యాదవ్ నవ్వుతూనే కనిపించారు. ఇలాంటి సంఘటనలు పలుమార్లు జరగడంతో లైట్ తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Om Birla: స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం నోటీసు
అయితే నితీష కుమార్ తీరును ఆర్జేడీ ఖండించింది. పార్లమెంటరీ మర్యాదను మీరడం ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు అలవాటేనని లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య అన్నారు. చాలాసార్లు అసభ్యకరమైన భాషను ఉపయోగించారని ఆరోపించారు. రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిని ‘అమ్మాయి’ అని సంబోధించిన నితీష్ కుమార్ గురించి ఏం చెప్పాలని తేజస్వి యాదవ్ అడిగారు. పదే పదే మహిళల పట్ల లోపభూయిష్ట వైఖరిని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Lok sabha: వెలుగులోకి విపక్ష మహిళా ఎంపీల మరో వీడియో.. కేంద్రమంత్రులు ఏం చేశారంటే..!
- Tags
- rabri devi
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!