సంక్రాంతి నాటికి గుంతల రహిత రోడ్లతో కూడిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. రేపు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో “గుంతల రహిత రోడ్ల” మిషన్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 15 నాటికి రాష్ట్రంలోని అన్ని రహదారులను గుంతల రహిత రోడ్లుగా మిషన్ మోడ్‌లో తీర్చిదిద్దడమే…
మాజీ మంత్రి మేరుగు నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ఎవరో ఒక మహిళ తాడేపల్లి పోలీసు స్టేషన్లో తనపై ఫిర్యాదు చేసిందని.. తాను ఆమెను శారీరకంగా లోబర్చుకుని, రూ. 90 లక్షలు తీసుకున్నానని ఆరోపిస్తుందని అన్నారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధం అని తెలిపారు.
ఇటీవలే మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన ముగించుకుని తిరిగివచ్చారు. ఈ క్రమంలో.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. రెడ్ బుక్‌లో రెండు చాప్టర్ ఓపెన్ అయ్యాయని.. త్వరలో మూడో చాప్టర్ కూడా ఓపెన్ అవుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఈదుపురంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లిన బాబు.. దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, ఎమెల్యేలు పాల్గొన్నారు.
దీపావళి పండుగ రోజున ఏలూరు నగరంలో విషాదం చోటు చేసుకుంది. దీపావళి టపాసులను బైక్‌పై తీసుకెళ్తుండగా ఒక్కసారి పేలిపోయాయి.. బండి గోతిలో పడి టపాసులు రాపిడికి గురై పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది.. అయితే, ఈ పేలుడు దాటికి వాటిని తరలిస్తున్న వ్యక్తి శరీరం ముక్కలు ముక్కలుగా ఎగిరిపడింది. పేలుడు దాటికి యాక్టివా బండి పూర్తిగా దగ్ధమైంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.. రేపు సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో మహిళలకు దీపం పథకాన్ని ప్రారంభించనున్నారు.. మొదట 833 రూపాయలు డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లోపు కస్టమర్ల ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
విశాఖపట్నంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. జైలు రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మెయిన్ బ్రాంచ్ లో ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో మంటలు మంటలు చెలరేగాయి.. వెంటనే స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం అంటూ ఇండియాస్పోరా, యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశం సందర్భంగా వెల్లడించారు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్టాన్సిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, సువిశాలమైన తీర ప్రాంతం, విస్తృతమైన రోడ్డు, జల, వాయురవాణా మార్గాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొందని, కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించే వారికి ఇదే మంచి సమయం అన్నారు.