ఒంగోలు పండుగలకు ఎంతో ప్రత్యేకం.. దసరా సంబరాల్లో కళారాలు.. దీపావళికి సత్యభామ.. నరకాసుర వధ.. వంటి సాంప్రదాయ కళలను, కళాకారులను ప్రోత్సహిస్తారు. అందులో భాగంగా దీపావళి రోజున సత్యభామ, నరకాసుర వధ వీధి పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టు ప్రదర్శిస్తారు.. 1902 వ సంవత్సరం నుంచి ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ లో ఉన్న యువజన మిత్ర మండలి నిర్వహించే నరకాసుర వధ కార్యక్రమం ఇంకెక్కడా కనిపించదు..
శాన్ ఫ్రాన్సిస్కో లో సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ శ్రీని తల్లాప్రగడ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేనితో నారా లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి వారికి వివరించారు. సేల్స్ ఫోర్స్ కార్యకలాపాల గురించి వివరిస్తూ... సేల్స్‌ఫోర్స్ కంపెనీ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (CRM) , క్లౌడ్-ఆధారిత సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్ గా ఉందని.. కస్టమర్ ఇంటరాక్షన్లు, సేల్స్ అండ్ సర్వీస్ ఆపరేషన్లను నిర్వహించడానికి సాధికారత కల్పించే సాధనాలను సరఫరా చేస్తుందన్నారు..
అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నారు ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. రాష్ట్రంలో పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతుండగా.. తన పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో లోని గూగుల్ క్యాంపస్ ను సందర్శించారు లోకేష్.. గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ తో పాటు వైస్ ప్రెసిడెంట్లతో సమావేశం..
కడప జిల్లా పర్యటన ముగించుకుని ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు బయల్దేరి వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. జిల్లాలో మూడు రోజుల పర్యటనలో బిజీ బిజీగా గడిపారు జగన్... జమ్మలమడుగు, కడప నియోజకవర్గాలకు సంబంధించిన నేతల మధ్య ఉన్న విభేదాలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. అయితే, ఈ రోజు ఉదయమే బెంగళూరు వెళ్లాల్సి ఉండగా.. ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కారణంగా మాజీ సీఎం హెలికాప్టర్ కు ఎయిర్ కంట్రోల్…
AP Deputy CM: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందనీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను ఇందు కోసం సద్వినియోగం చేసుకొందామన్నారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా దీపం పథకం అమలు చేయనున్నాము.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం నిలబడి సంవత్సరానికి 2,600 కోట్ల రూపాయలతో ఉచిత గ్యాస్ పథకం అమలు చేస్తుంది అన్నారు. ప్రతి మహిళకి ఆరోగ్య సమస్య రాకుండా సుమారు కోటి 50 లక్షలు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతారు.
Kandula Durgesh: పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రం సమీపంలో పిడుగు పాటు ధాటికి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటనపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Chandrababu: బుడమేరు వరదల్లో దెబ్బతిన్న వాహనదారులకు బీమా చెల్లింపులకు సంబంధించి పెండింగులో ఉన్న దరఖాస్తులను 15 రోజుల్లోపు పూర్తి చేయాలని బీమా సంస్థల ప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.