ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా డ్రోన్ పాలసీ 2024-29ను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రూపొందించింది. డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన, రూ.3 వేల కోట్ల రాబడి లక్ష్యంగా కేబినెట్ నిర్ణయించింది.
విజయనగరం స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడిని వైఎస్ జగన్ ప్రకటించారు. విజయనగరం జిల్లా నేతల సమావేశంలో వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడినట్లు అధికారులు ధృవీకరించారు. మొదట బుధవారమే విడుదల కావాల్సి ఉండగా, వివిధ అనివార్య పరిస్థితుల కారణంగా ఇప్పుడు ప్రకటన ఆలస్యం అవుతుంది. మరో రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
నేటి నుంచి నాలుగు రోజులపాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో విదేశీ నిపుణుల బృందం పర్యటించనుంది.కొత్తగా నిర్మించనున్న డయాఫ్రమ్ వాల్, ఇసిఆర్ఎఫ్ డ్యాం నిర్మాణాలపై ప్రాజెక్టు అధికారులతో కలిసి ఈ బృందం చర్చించనుంది..ముందుగా విదేశీ నిపుణులు, ఇంజినీర్లు ప్రాజె క్టును ఆమూలాగ్రం పరిశీలించనున్నారు.
ఏపీ కేబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనున్నది. ముఖ్యంగా, 1982 ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోబడే అవకాశం ఉంది.
రేపు(బుధవారం) ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సాయంత్రం 6.30 గంటలకు ఆయన సమావేశం కానున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకుంటారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తారు.
ఏసీబీ వలకు ఓ అవినీతి చేప చిక్కింది. మహిళా రైతు నుండి రెండు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గుంటూరు జిల్లాలోని అంకిరెడ్డిపాలెం వీఆర్వో షేక్ హసీనా బేగం పట్టుబడింది. చెరుకూరి ప్రమీలా రాణి అనే మహిళ రైతు నుండి పాస్ పుస్తకాల పేరు మార్పు కోసం రూ.2 .50 లక్షల డిమాండ్ చేశారు.
పారదర్శకంగా, పకడ్బందీగా మెగా డీఎస్సీకి ఏర్పాట్లు చేయాలని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈనెల 11న ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం చేయనున్నారు. ప్రైవేటు సంస్థలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను తీర్చిదిద్దాలన్నారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. మెగా డీఎస్సీ నిర్వహణ విధివిధానాలపై సమావేశంలో చర్చించారు.
కూటమి గెలుపు కోసం చంద్రబాబు కుటుంబంలోని ప్రతి ఒక్కరు ప్రచారంలో పాల్గొని విజయం కోసం కృషి చేశారు. చంద్రబాబు, లోకేష్‌తో పాటుగా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా ప్రచారం చేశారనే విషయం తెలిసిందే. ఈ ప్రచారం సమయంలో మంగళగిరిలో ఇచ్చిన హామీని నారా బ్రాహ్మణి తాజాగా నెరవేర్చారు.