కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ వాసన విద్యాసాగర్ నాయుడును ఇన్చార్జిగా నియమించారు. బదిలీ అయిన హర్షవర్ధన్ రాజును డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలలో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో, పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లను మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. డీజీపీ రాజకీయ నేత లాగా వ్యవహరించకూడదని ఆయన వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు, మా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనలో ఉన్నారు. తొలిసారి ఏపీ ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి అమిత్ షాతో సమావేశమయ్యారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనలో ఉన్నారు. తొలిసారి ఏపీ ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఏపీలో పరిస్థితులు, రాజకీయ అంశాలపై అమిత్ షాతో పవన్ కల్యాణ్ చర్చించే అవకాశం ఉంది.
విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ రఘురాజుపై వైసీపీ వేసిన అనర్హత పిటిషన్పై మండలి ఛైర్మన్ తీసుకున్న అనర్హత వేటును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు, కొంతమంది అధికారుల తీరుపైన చంద్రబాబు మంత్రులతో చర్చించారు. గత ప్రభుత్వంలో విమర్శలు ఎదుర్కొన్నా అధికారుల తీరు మారలేదని మండిపడ్డారు
సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ కేబినెట్లో కీలక చర్చ జరిగింది. సోషల్ మీడియాలో పోస్టులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చను లేవనెత్తారు. కొంత మంది వైసీపీ నేతలు మళ్లీమళ్లీ పోస్టులు పెడుతున్నారని.. వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని పవన్ కల్యాణ్ కేబినెట్ సమావేశంలో పేర్కొన్నారు.
ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా డ్రోన్ పాలసీ 2024-29ను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రూపొందించింది. డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన, రూ.3 వేల కోట్ల రాబడి లక్ష్యంగా కేబినెట్ నిర్ణయించింది.
విజయనగరం స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడిని వైఎస్ జగన్ ప్రకటించారు. విజయనగరం జిల్లా నేతల సమావేశంలో వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.