ఈ బడ్జెట్ గత ఐదేళ్లలో జరిగిన దాన్ని సరిచేస్తూ ఇచ్చిన బడ్జెట్ ఇది అంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రూ.18,421 కోట్లతో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు ఇచ్చారని వెల్లడించారు. గత బడ్జెట్ కంటే 23 శాతం ఎక్కువ ఆరోగ్యశాఖకు కేటాయించారన్నారు.
తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 12లోగా ఎన్నిక నిర్వహణ పూర్తి చేయాలని నిర్ణయించారు.. ఈ నెల 18 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నారు.
తిరుపతికి చెందిన దొంగ నోట్లు తయారీ ముఠాను పుత్తూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. డీఎస్పీ రవికుమార్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. తెలంగాణ నుంచి వచ్చిన డీ రోనాల్డ్ రోస్‌ను ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమించారు. కె.కన్నబాబుకు మున్సిపల్, పట్నాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
నెల్లూరులో రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతికి కొత్త విధానాన్ని తీసుకువస్తున్నామని వెల్లడించారు. లైసెన్స్డ్ సర్వేయర్ లేదా ఇంజనీర్లు ప్లాన్ సమర్పిస్తే చాలు అని పేర్కొన్నారు.
రేపటి నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రేపు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రేపు ఉదయం 9 గంటలకు బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనునుంది. ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది