రానున్న 36 గంటల్లో బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నవంబర్ 12-15 వరకు అంటే నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత 24 గంటల్లో వాతావరణ నివేదిక ప్రకారం.. తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లలో ఉదయం దట్టమైన నుంచి చాలా దట్టమైన పొగమంచు నమోదైంది.
వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి వర్రా రవీంద్ర రెడ్డిని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ఆయన కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇప్పటికీ కోర్టులో ప్రవేశపెట్టకపోవటంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను చంపేందుకు కుట్ర పన్నారని రవీంద్ర భార్య కళ్యాణి భయపడుతున్నారు.
చిత్తూరు, తిరుపతి జిల్లాలో హౌసింగ్‌పై మంత్రి కొలుసు పార్థసారథి సమీక్ష నిర్వహించారు. పీఎంఈవై మొదటి దశలో లో కేటాయించిన 70శాతం ఇళ్ళ నిర్మాణం పూర్తయిందని మంత్రి పార్థసారధి వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలనేది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని వెల్లడించారు.
గండికోట ప్రపంచంలో టాప్ 10 ప్రదేశాలలో ఒకటని.. 13వ శతాబ్దం లో నిర్మించారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గండికోటలో కోట సముదాయంలో రాజవంశాల వారసత్వాలు ఉన్నాయన్నారు. గండికోట లోఅడ్వంచెర్ గేమ్స్‌కి అవకాశాలు ఉన్నాయని.. గండికోట లో కూడా సీప్లేన్ ఆపరేషన్స్ ఉంటాయి.. ఇవాళే అక్కడ దిగాలనుకున్నామన్నారు. కేంద్రం సహకారంతో సీప్లేన్లు ఎక్కువ ప్రాంతాల్లో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
పల్నాడు జిల్లా క్రోసూరులో ప్రేమ కోసం ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. క్రోసూరుకు చెందిన యువకుడు మస్తాన్ వలి సెల్‌టవర్ ఎక్కగా.. పోలీసులు అక్కడికి చేరుకుని అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. క్రోసూరు గ్రామానికి చెందిన మస్తాన్ వలి అనే యువకుడు సిరిపురం గ్రామానికి చెందిన యువతిని పెద్దలకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని సీఎం చంద్రబాబు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, తదితరులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు.
రాబోయే రోజుల్లో రెండు, మూడు విమానాలు వచ్చే అవకాశం ఉందన్నారు సీఎం చంద్రబాబు.. పచ్చదనం, జలాల మధ్య శ్రీశైలంలో సీ ప్లేన్ చాలా అందంగా ఉందన్న ఆయన.. భారత్ లో మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాం అన్నారు.. అయితే, సీ ప్లేన్, బోట్లు, రోడ్డు రవాణాను లింక్ చేస్తేబాగుంటుందన్నారు సీఎం
విశాఖ నగరంలో గంజాయి పంట కలకలం రేపింది.. కేజీహెచ్ లేడీస్ హాస్టల్ వెనుక ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి పండిస్తున్నారు కొంతమంది యువకులు.. గత రెండేళ్లుగా గంజాయి పండిస్తు మత్తుకు బానిసలుగా మారారు.. ఏజెన్సీ నుండి తీసుకొచ్చి ఇక్కడ పండిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.. గంజాయి సేవించి మిగిలిన వాటిని నగరంలో స్టూడెంట్స్ కి విక్రయిస్తున్నారు గంజాయి గ్యాంగ్.. పక్కా సమాచారంతో గుట్టురట్టు చేశారు విశాఖపట్నం వన్ టౌన్ పోలీసులు.
భవిష్యత్ అంతా పర్యాటకానిదే అన్నారు సీఎం చంద్రబాబు.. భవిష్యత్‌లో ఏ యిజం ఉండదు.. టూరిజం ఒక్కటే ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో తొలిసారి పర్యాటకంగా ‘సీ ప్లేన్’ వినియోగం ఏపీ నుంచి ఆరంభం కానుందన్నారు..