ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్షంలో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు.. జనసేన కండువా కప్పుకున్నారు.. విజయవాడ సిటీ నుంచి పలువురు కార్పొరేటర్లు , జగ్గయ్య పేట, ధర్మవరం, అనంతపురం ప్రాంతాల నుండి వైసీపీకి గుడ్‌బై చెప్పి వచ్చిన నేతలు.. జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
ఏపీ ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో 2024-25కి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.. రూ. 2,94,427.25 కోట్లతో కూడిన వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ ముందు పెట్టారు.. అయితే, వైసీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఏపీ బడ్జెట్‌పై సెటైర్లు వేశారు.. ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిందన్న ఆయన.. ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల వరకు బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు.. ఏపీ ప్రజలకు బడ్జెట్ గండికోట…
మరో రెండు పథకాల అమలు కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాం అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు.. గత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు..
ఐఎండీ సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలోని ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది తదుపరి రెండు రోజుల్లో పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు / శ్రీలంక తీరాల వైపు కదిలేందుకు అవకాశం ఉందన్న ఆయన.. మరోవైపు నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర నుండి పశ్చిమమధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు.. దీని ప్రభావంతో రేపటి నుంచి మూడు రోజుల…
ప్రజలు మిమ్మల్ని గెలిపించింది శాసనసభకు రావడానికే.. కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసన సభకు రాకుండా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. ఇక, గుంతల్లో చిడతల బేరం పేరుతో మీడియాలో కథనాలు వస్తున్నాయి.. గడిచిన ఐదు సంవత్సరాలకే రోడ్లు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలుసు అన్నారు..
వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.. అయితే, ఈ నెల 22వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం.. అసెంబ్లీ సమావేశాలు సీరియస్ గా జరగాలి అన్నారు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.. సమగ్ర శిక్షా ఉద్యోగులకు సమ్మె కాలపు వేతనాలు విడుదల చేసిందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్.. ఈ మేరకు అంగీకారం తెలిపారు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్..
అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు పడినట్టు అయ్యింది.. అమరావతి నిధుల ప్రతిపాదనపై ప్రంపచబ్యాంకు, ఏడీబీ, హడ్కో రుణాలపై ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది.. ప్రపంచ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు.. ఈ భేటీలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో పాటు ప్రపంచబ్యాంకు, ఏడీబీ, హడ్కో బ్యాంకు అధికారులు పాల్గొన్నారు..
వైసీపీ సోషల్ మీడియాపై కేసులు పెట్టడాన్ని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఖండించారు. టీడీపీ- జనసేన చేసిన సోషల్ మీడియా పబ్లిసిటీలో వైసీపీ ది 10 శాతం కూడా లేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల వాక్ స్వాతంత్రపు హక్కును హరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం చేసే తప్పులు గురించి మాట్లాడకూడదా.. ఇదేమన్నా ఎమర్జెన్సీ పాలనా అంటూ ప్రశ్నించారు.