Nara Rammurthy Naidu: చంద్రబాబు సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమం.. హుటాహుటిన హైదరాబాద్‌కి లోకేష్..
- విషమంగా నారా రామ్మూర్తి నాయుడి ఆరోగ్య పరిస్థితి..
- హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రబాబు సోదరుడు..
- హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరిన మంత్రి లోకేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Rammurthy Naidu: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారట రామ్మూర్తి నాయుడు.. అయితే, తన చిన్నాన్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారం అందుకున్న మంత్రి నారా లోకేష్.. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని.. అమరావతి నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు.. ఓవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల కొనసాగుతున్నాయి.. మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.. అయితే, చిన్నాన్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమాచారం తెలియగానే అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని వెంటనే హైదరాబాద్‌కు బయల్దేరారు మంత్రి నారా లోకేష్..
Read Also: Road Accidents: భారత్‌లో ప్రతి గంటకు 52 రోడ్డు ప్రమాదాలు, 20 మంది మృతి.. అధ్యయనంలో వెల్లడి
Also Read
కాగా, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు.. 1994లో చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన.. 1999 వరకు ప్రజలకు సేవలందించారు. ఆ తర్వాత ఆయన క్రమంగా రాజకీయాలకు దూరం అయ్యారు.. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు.. వారిలో ఒకరు నటుడు రోహిత్ కాగా.. మరో కుమారుడు నారా గిరీష్…
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?