నేను 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను.. కానీ, ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు.. అసెంబ్లీలో ఈ రోజు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వర్క్ షాప్ నిర్వహించారు.
వాళ్లకు బాధ్యత లేదు.. కానీ, మనకు ఉంది.. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం అని సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలన్నారు.. ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై ప్రతి ఎమ్మెల్యే అధ్యయనం చేయాలని సూచించారు. పబ్లిక్ గవర్నెన్స్ లో ఎమ్మెల్యేలనూ భాగస్వామలను చేస్తాం.. ప్రజలు మనపై అనేక ఆశలు పెట్టుకున్నారు.. నమ్మకం పెట్టుకున్నారు.. ప్రజల నమ్మకం మేరకు వారి సమస్యలపై సభలో చర్చించాలి. అర్థవంతమైన చర్చలకు సభ వేదిక…
పోసాని కృష్ణ మురళిపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నేతలు.. వైసీపీ హయాంలో పోసాని ఇష్టంవచ్చినట్టు మాట్లాడారని.. అయితే, తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా పోసాని మాట్లాడరని మండిపడ్డారు
దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దుర్మార్గులు నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కొలుములపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.
వరకట్నం కోసం వేధించేవారు మాత్రం మారటం లేదు. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట వరకట్న వేధింపులకు ఆడబిడ్డలు బలవుతూనే ఉన్నారు. తాజాగా విశాఖలో వరకట్న వేధింపులకు మరొక వివాహిత బలి అయింది. విశాఖలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో45 మంది ప్రయాణికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసు రద్దు చేయడంతో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు.
సోమవారం ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రూ.2.94 లక్షల కోట్లతో మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా.. ఇవాళఉదయం 10 గంటలకు బడ్జెట్‌పై ఎమ్మెల్యే లకు అవగాహనా కార్యక్రమం నిర్వహించనున్నారు.
Varra Ravinder Reddy: వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం రవీందర్ రెడ్డికి కడప సెకండ్ ఏడీఎం మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. ఈకేసులో అరెస్టయిన మరో ఇద్దరు నిందితులు ఉదయ్ , సుబ్బారెడ్డి లకు 41A నోటీసులు ఇచ్చి పంపాలని మెజిస్ట్రేట్ పోలీసులకు తెలిపారు. అర్దరాత్రి రెండు గంటల సమయంలో వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అనంతరం కేసుకు…