Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో భారతీయులు గూగుల్ లో ఎక్కువగా హెచ్1బీ వీసా, ఇమ్మిగ్రేషన్ గురించి శోధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గూగుల్ ట్రెండ్స్ ఓ నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నట్లు పలు వార్తా కథనాలు వస్తున్నాయి. అయితే, అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక అక్రమ వలసదారులను బహిష్కరిస్తాం, ఇమ్మిగ్రేషన్ చట్టాలను మరింత కఠినతరం చేస్తానని డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో వాగ్దానం చేశారు. కాగా, ఎన్నికల్లో ఆయన విజయం సాధించడంతో ఇమ్మిగ్రేషన్, హెచ్1బీ వీసాల గురించి భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసినట్లు సమాచారం.
Read Also: Jayam Ravi : దీపావళి డిజాస్టర్ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
అయితే, మరోవైపు హెచ్1బీ వీసా గురించి శోధిస్తున్న ప్రాంతాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా.. చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఆ తరువాత స్థానాల్లో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇక, అమెరికాకు చెందిన కొందరు డొనాల్డ్ ట్రంప్ పాలనకు దూరంగా ‘దేశాన్ని వీడి ఎలా వెళ్లాలి?’ అనే అంశంపై ఎక్కువగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ట్రంప్ అధికారంలోకి వస్తే గర్భవిచ్ఛిత్తి హక్కును నిషేధిస్తారంటూ వస్తున్న వార్తలతో అమెరికా ప్రజల్లో ఆందోళనలు పెరిగింది. ఈ క్రమంలోనే అక్కడి ప్రజలు కెనడా, స్కాట్లాండ్‌తో సహా ఇతర దేశాల్లోని అబార్షన్, స్వలింగ హక్కుల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.