పంచకర్ల రమేష్ బాబు...! గండి బాబ్జీ...! కూటమి పార్టీల్లో సీనియర్ నేతలు...కేరాఫ్ పెందుర్తి. ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే మరొకరు మాజీ శాసనసభ్యుడు. ఎన్నికల సమయంలో కలిసి వుంటే కలదు సుఖం అని డ్యూయెట్లు పాడుకున్న ఈ నేతల మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ జరుగుతోందని జనసేన, టీడీపీ కేడరే తెగ చెవులు కొరికేసుకుంటోంది.
కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ యురేనియం పరీక్షలు, తవ్వకాలపై కీలక ప్రకటన చేశారు కలెక్టర్ రంజిత్ బాషా.. యురేనియం లభ్యత, పరిశోధన కోసం బోర్ల తవ్వకాల ప్రక్రియను ఆపివేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని వెల్లడించారు.. ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఇక మీదట యురేనియం ఎలాంటి ప్రక్రియ కొనసాగకూడదని సీఎం చెప్పారు.. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు కలెక్టర్ రంజిత్ బాషా..
మరోసారి ఎమ్మెల్యేలకు సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వర్క్ షాప్ నిర్వహించారు... అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ వంటి అవకాశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించడానికి ఈ వర్క్ షాప్ నిర్వహించారు.. తొలిసారి ఎమ్మెల్యేలైన వారికి ఈ వర్క్ షాప్ లో మరింత ప్రాధాన్యత కల్పించారు... బడ్జెట్ పై పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు.. అయితే, బడ్జెట్ సమావేశాలపై…
అభివృద్ధి, సంక్షేమాలకు వారధిగా రాష్ట్ర బడ్జెట్ ఉందని టీటీడీ బోర్డు మెంబర్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై జగ్గంపేటలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు, అలాగే అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
ఏపీపీఎస్సీ.. గ్రూప్-2 మెయిన్స్ ను రీషెడ్యూల్ చేస్తూ ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేసింది.. పాత షెడ్యూల్ ప్రకారం 2025 జనవరి 5వ తేదీన గ్రూప్ -2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. 2025 ఫిబ్రవరి 23వ తేదీకి గ్రూప్ -2 మెయిన్స్ వాయిదా వేసినట్టు ప్రకటించింది ఏపీపీఎస్సీ.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను http://psc.ap.gov.in సందర్శించాలని పేర్కొంది ఏపీపీఎస్సీ..
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా.. ఇప్పుడు ప్రముఖ సంస్థ రిలయన్స్ ఏపీలో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది.. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - రిలయన్స్ మధ్య ఒప్పందం కుదిరింది.. ఆంధ్రప్రదేశ్ లో రూ.65 వేల కోట్ల భారీ పెట్టుబడులపై రిలయన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది..
కూటమి శాసన సభాపక్ష సమావేశం ముగిసింది.. అయితే, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసన సభాపక్ష భేటీలో ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. 150 రోజుల పాలనలో చేసిన అన్ని అంశాలపై చర్చ సాగింది.. మంత్రులు.. ఎమ్మెల్యేలకు అన్ని విషయాలలో సహకరించాలని సూచించారు.. ఎమ్మెల్యేలు అందరూ హుందాగా ఉండటం అలవాటు చేసుకోవాలన్న ఆయన.. ప్రతిపక్షం లేదని నిర్లక్ష్య ధోరణి వద్దు అని ఎమ్మెల్యేలను హెచ్చరించారు..
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైవీ సుబ్బారెడ్డి.. అయితే, ప్రతి కార్యకర్తకు మేం అండగా నిలబడతాం అన్నారు.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 57 మంది సోషల్ యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించారు.. 12 మంది కార్యకర్తల ఆచూకీ తెలియడం లేదన్నారు.