జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి సిద్ధం అయ్యారు.. నేటి నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో బహిరంగసభలు, రోడ్‌షోలలో పాల్గొననున్నారు పవన్.. మొత్తంగా మహారాష్ట్రలో రెండు రోడ్ షోలు, ఐదు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు ఏపీ డిప్యుటీ సీఎం.. తొలి రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు పవన్ కల్యాణ్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో శుక్రవారం భేటీ అయ్యారు..
Cabinet Sub Committee : అమరావతిలో భూ కేటాయింపులపై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో, రాజధానిలోని పలు సంస్థలకు భూమి కేటాయింపులు చేసే అంశంపై మంత్రుల కమిటీ ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ కమిటీ లో మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్, టీజీ భరత్ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ కమిటీ, గతంలో రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేసిన సంస్థల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించనుంది.…
IIT Madras : సామాజిక సంబంధిత కార్యకలాపాల్లో ఏపి ప్రభుత్వంతో కలసి పనిచేయాలని ఐఐటి మద్రాసు నిర్ణయించింది. ఐఐటిఎం ప్రతినిధులతో ఈరోజు ఉదయం సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. సాయంత్రం మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటి మద్రాసు, ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలు అమరావతిని ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడం, పరిశోధన, శిక్షణ, సాంకేతికతలో రాష్ట్రం ముందుకు పోవడానికి దోహదం చేస్తాయి. 1.…
ప్రభుత్వం 'సూపర్ సిక్స్ హామీలు' కింద అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా ఇప్పటి వరకు 25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్దిదారులకు అందించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
విజయవాడ మునకకు కారణం బుడమేరు కాదు.. నాయకుల తప్పిదం అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, పూడిక తీస్తే వరదల ప్రభావం అంతగా ఉండదు.. ఆక్రమణల కారణంగా ముంపునకు ప్రభుత్వాలు చేసే తప్పుడు పనుల వల్ల ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెనుమాకలంక గ్రామంలో పర్యటించిన ఆయన.. కొల్లేరును పరిశీలించి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు..
అనంతపురం జిల్లా తాడిపత్రిలో బహిరంగ ప్రదేశంలో చెత్త వేస్తే కుళాయి, విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.. తాడిపత్రిలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా ప్రజలలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ.. ఇకపై చెత్త వేస్తే తిరిగి వారి నివాసంలో వేస్తామని తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు..