అనంతపురం జిల్లా తాడిపత్రిలో బహిరంగ ప్రదేశంలో చెత్త వేస్తే కుళాయి, విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.. తాడిపత్రిలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా ప్రజలలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ.. ఇకపై చెత్త వేస్తే తిరిగి వారి నివాసంలో వేస్తామని తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు..
కీలక సూచనలు చేశారు మంత్రి నారాయణ.. ఇంటర్ తరగతుల నిర్వహణ ఎలా ఉండాలి, విద్యార్థులను ఎలా చదివించాలి, సబ్జెక్టుల వారీగా తీసుకోవలసిన ప్రాధాన్యత అంశాలపై పలు సూచనలు చేశారు నారాయణ .. ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ కృతికా శుక్లా వినతి మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులకు వర్క్ షాప్ లో పాల్గొని కీలక అంశాలను పంచుకున్నారు.. అంతేకాదు.. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా నారాయణ గ్రూప్ నుంచి సహకారం అందిస్తామని వెల్లడించారు.
ప్రపంచానికి ఫుడ్ బాస్కెట్‌గా ఏపీ అవతరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉద్యోగాలు, ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాలు ఇచ్చేలా కొత్త విధానాలను రూపొందించాం అన్నారు.. మొదటిగా వచ్చిన 200 పరిశ్రమలకు కూడా ప్రోత్సాహకాలు ఇచ్చేలా విధానాలు ఉన్నాయి.. 50 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నాం.. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తాం.. అమరావతి, విశాఖ, రాజమహేంద్రవరం,…
విజయవాడలోని కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో జెర్సీ కలకలం సృష్టించింది.. హోటల్లో ఓ కస్టమర్ భోజనం ఆర్డర్ ఇవ్వగా.. ఆ భోజనంలో జెర్రీ దర్శనం ఇచ్చింది.. దీంతో.. షాక్‌కు గురయ్యాడు సదరు కస్టమర్.. అదే సమయంలో అదే హోటల్లో భోజనం చేస్తున్నారు కేంద్ర మానవ హక్కుల కమిషన్ (NHRC) ఇంఛార్జ్ చైర్మన్ విజయభారతి సయానీ.. దీంతో.. కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ నిర్వాహకుల తీరుపై కేంద్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సీరియస్ అయ్యింది.
విశాఖపట్నం గాజువాకలో దారుణం జరిగింది.. పెదగంట్యాడ లో యువతిపై జమ్మూ కాశ్మీర్‌కు చెందిన నీరజ్ శర్మ రాడ్‌తో దాడి చేశాడు.. అడ్డుకునేందుకు యత్నించిన మరో ఇద్దరిపై కూడా దాడికి పాల్పడ్డాడు.. అయితే, బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు.. ఉన్మాది దాడిలో గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు.. ఇక, ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడ్డ యువతికి మెరుగైన వైద్యం కోసం కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు... తలపై సుమారు 30 కుట్లు పడ్డాయి.. ప్రేమోన్మాది దాడి…
విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రద్దు అయ్యాయి.. ఇప్పటికే జారీ చేసిన విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. ఇక, రఘురామకృష్ణం రాజుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సినిమా రంగంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో.. రాజకీయాల్లో (రఘు రామకృష్ణం రాజు) 'ఆర్ఆర్ఆర్' కూడా ఓ సంచలనంగా పేర్కొన్నారు..
ప్రపంచ శాంతికి శ్రీశ్రీ రవిశంకర్ గొప్ప మార్గం చూపారు అంటూ ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ రోజు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్.. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రపంచ శాంతికి, భారతదేశ ఆధ్యాత్మిక విశిష్టత ప్రాచుర్యానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గొప్ప మార్గం చూపించారని, ఆ మార్గంలో మనస్ఫూర్తిగా ముందుకెళ్తామన్నారు..
ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తన తల్లినీ అవమానించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు వైఎస్ షర్మిలను, వైఎస్ విజయమ్మను కూడా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమాన కరంగా మాట్లాడుతున్నారు అని మంత్రి వ్యాఖ్యానించారు.