ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పర్యటించనున్నారు.. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును పురస్కరించుకుని ఇక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు..
పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రు పాలెం వద్ద అమానుషం చోటు చేసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కారులో తీసుకొచ్చి సాగర్ కాలువలో పడేశాడు కుమారుడు వెంకటేశ్వర్లు.. నూజెండ్లకు చెందిన తండ్రి గంగినేని కొండయ్య (85)ను కాలువలో పడేశాడు కుమారుడు.
సూపర్ సిక్స్ అన్నాడు.. అయితే ఇప్పుడు అది సాధ్యం కాదని చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. కడప వైసీపీ జిల్లా సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు.
తప్పిపోయిన కుటుంబ సభ్యులు, మహిళలు, బాలికలు, యువతల కేసుల్లో విశాఖ పోలీసులు పట్టుబట్టి కేసును చేధిస్తున్నారు. తాజాగా.. మరో మిస్సింగ్ కేసును విశాఖ పోలీసులు సాల్యూ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడెంకు చెందిన ఓ బాలిక మిస్సింగ్ కేసును 24 గంటల్లో చేధించి తల్లిదండ్రులకు అప్పగించారు.
తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్లో వైసీపీ 'ఫీజు పోరు' పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి హాజరయ్యారు.
విశాఖలో స్టీల్ ప్లాంట్ పర్యటనలో కేంద్ర మంత్రి హెచ్డీ కుమార స్వామి బిజీబిజీగా గడిపారు. ఆయనతో పాటు.. ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా.. ఆర్ఐఎన్ఎల్ (RINL) డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో ప్లాంట్ వాస్తవ పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ ధరలు అమలు కానున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు ఇవాళ తాకిడి పెరిగింది. దీంతో సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ఓపెన్ కాకుండా సర్వర్లు మొరాయిస్తున్నాయి.
చిత్తూరు జిల్లా మంగళంపేట పరిధిలో మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలపై ఏర్పాటు చేసిన అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో సంయుక్త కమిటీ విచారణ ప్రారంభించింది.. కమిటీలో సభ్యులైన చిత్తూరు కలెక్టర్ మంగళంపేట పరిధిలో పెద్దిరెడ్డి ఆక్రమించారని భావిస్తున్న 295, 296 సర్వే నెంబర్లలోని భూములకు సంబంధించిన పాత దస్త్రాలను పరిశీలించారు.
తాను సంతృప్తికరంగా సర్వీసును ముగిస్తున్నాను అన్నారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమల రావు. ఏడు నెలలుగా డీజీపీగా పని చేస్తున్నాను.. 35 ఏళ్లుగా పోలీస్ సేవలు సంతృప్తికరంగా అందించాను అనే తృప్తి ఉంది.. సంతృప్తికరంగా సర్వీసును ముగిస్తున్నాను అన్నారు..