venky pooja: వెంకీ మూవీలో పూజా హెగ్డే..రూమర్స్‌కు ఫుల్ స్టాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి అంటేనే బాక్సాఫీస్ దగ్గర మినిమం గ్యారంటీ. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యిందని నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. గతంలో ‘F3’ సినిమాలో పూజా ఒక స్పెషల్ సాంగ్ చేయడంతో, ఈసారి మెయిన్ హీరోయిన్‌గా ఆమెనే తీసుకున్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది. ఆమెతో కనీసం చర్చలు కూడా జరపలేదని, అవన్నీ కేవలం పుకార్లేనని తేల్చి చెప్పేసింది.
Also Read : Mahesh Babu: ఇండియాలో నా ఫేవరెట్ ఫుడ్ ఇదేనంటూ మహేష్ బాబు కామెంట్స్!
Also Read
మరోవైపు, టాలీవుడ్‌లో సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న పూజా హెగ్డేకు ఒక బంపర్ ఆఫర్ తగిలిందని సమాచారం. వరుస హిట్లతో దూసుకుపోతున్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన ఆమె ఛాన్స్ కొట్టేసిందట. ఒక పవర్‌ఫుల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో దుల్కర్ హీరోగా నటిస్తుండగా, అందులో పూజా హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు కథా పరంగా చాలా ప్రాధాన్యత ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
ప్రస్తుతం పూజా హెగ్డే తన కెరీర్‌ను మళ్ళీ ట్రాక్‌లో పెట్టేందుకు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. వెంకటేష్ సినిమా రూమర్స్‌కు ఎండ్ కార్డ్ పడినా, దుల్కర్ సల్మాన్ వంటి క్రేజీ హీరో పక్కన ఛాన్స్ రావడంతో ఆమె ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ రొమాంటిక్ డ్రామా పూజాకి తెలుగులో పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందో లేదో చూడాలి!
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!