లావు శ్రీకృష్ణదేవరాయలు..... పార్టీలు వేరైనా...వరుసగా రెండు సార్లు నరసరావుపేట ఎంపీగా గెలిచిన నాయకుడు. 2019లో తొలిసారి వైసీపీ తరపున, 2024లో టీడీపీ నుంచి లోక్సభలో అడుగుపెట్టారాయన. అంతవరకు బాగానే ఉన్నా... తన నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో లావు సంబంధాలపై కొత్త చర్చ జరుగుతోంది. పార్టీ మారినా ఆయన తీరు మాత్రం మారలేదా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. 2019లో వైసీపీ నుంచి గెలిచినప్పుడు మొదట్లో అంతా బాగానే ఉంది. రాజకీయాలకు కొత్త కావడంతో అందరితో కలిసిపోయినట్టు…
రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, ఆకృత్యాలు, అత్యాచారాలు, హత్యలపై మీరు ప్రశ్నించకుండా.. రప్పా.. రప్పా.. అంటూ మీడియా ముందుకు వచ్చేసారని పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు సీదిరి అప్పలరాజు.. చంద్రబాబు చేస్తున్న మోసాలు, వెన్నుపోటు గురించి ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్.. గుర్తు పెట్టుకో.. నిన్ను అధహ్ పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణే కాదు.., నా పార్టీ జనసేనే కాదు.., ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ ఇవి. అయితే, అది పవన్ వల్ల జరిగిందా? లేక ఇతరత్రా అన్ని కారణాలు కలిసి కొట్టాయా అన్నది వేరే సంగతి గానీ... మొత్తం మీద ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది.
కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు.. మీరు ఎన్నికేసులు పెట్టినా మమ్మల్ని ఆపలేరు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి మాజీ మంత్రి విడదల రజిని.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. పల్నాడు జిల్లా పర్యటనపై మీడియాతో మాట్లాడిన ఆమె.. సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించి కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు.
సూర్య నమస్కారలాలో కొత్త రికార్డు సాధించారు గిరిజన విద్యార్ధులు.. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది.. గిన్నిస్ రికార్డు సృష్టించేలా 108 నిమిషాల్లో 108 సూర్యనమస్కారాలు చేసి 25 వేల మంది గిరిజన విద్యార్థులు రికార్డు సృష్టించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్.. విద్యార్థులను అభినందించారు.
కడపలో మేయర్ సురేష్ బాబు వర్సెస్ కమిషనర్గా మారిపోయింది వ్యవహారం.. కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ఉత్కంఠభహితంగా సాగింది.. ఉదయం నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠత అక్కడ నెలకొంది... మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి కల్పించాలని సజావుగా నిర్వహణకు ఆదేశాలు ఇవ్వాలంటూ కడప మేయర్ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు.
బనకచర్ల ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్రానికి ఇవ్వడంతో.. ఆంధ్రప్రదేశ్ తో అసలు సమస్య మొదలైందని సీఎం రేవంత్ అన్నారు. మొదట తెలంగాణకు రిపోర్ట్ ఇచ్చి ఉంటే గొడవ వచ్చేది కాదు అని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాల పరిష్కారం కోసం మేము సిద్ధంగా ఉన్నాం.. అనవసర రాద్ధాంతం చేయాలని ఆలోచన మాకు లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.. అయితే, ఇదే సమయంలో.. పోలవరాన్ని భారీ టూరిజం ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర 15 ఎకరాల్లో రిసార్ట్ ఏర్పాటుపై దృష్టి సారించారు అధికారులు.. 255 కోట్ల రూపాయలతో రిసార్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది..