ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీఆర్ సీఎం అయ్యారు..
ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.. అది ప్రజాస్వామ్య విజయం అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్‌కు మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు.. ప్రజాస్వామ్యవాదులతో కలిసి 30 రోజులు పోరాటం చేసి ఎన్టీఆర్ విజయం సాధించారు.. ఇందిరా గాంధీ మెడలు వచ్చారని పేర్కొన్నారు.. భారత్‌లో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తిఅయిన సందర్భంగా.. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ‘సంవిధాన్ హత్యా దివస్’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ.. ఆ అరాచక, అప్రజాస్వామిక పాలన నేటికీ మానని గాయంగా మిగిలిందన్నారు.. ఇక, ఏపీలో ఆరేళ్ల కిందట ఇదే రోజు ప్రజా వేదిక కూల్చారని.. ప్రజావేదిక కూల్చివేతకు ఆరేళ్లు సందర్భంగా ఈ సంవిధాన్ హత్యా దివస్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు చంద్రబాబు.. భారతదేశం అతి పెద్ద ప్రజాసౌమ్యం.. దేశంలో ఎన్నో మలుపులు, సవాళ్లు, విజయాలు చూసాయి.. ప్రజాసౌమ్యాన్ని కాపాడుకున్న ఏకైక దేశం భారత దేశం అన్నారు చంద్రబాబు.. అత్యవసర పరిస్థితి అనేది చీకటి రోజులు.. సమరం, నారాయణ.. వారి చీకటి రోజుల అనుభవాలని గుర్తుచేశారు.. మంచి రోజులే కాదు చీకటి రోజులు కూడా గుర్తుపెట్టుకుంటేనే ఏది మంచి ఏది చెడో తెలుసుకుంటాం అన్నారు.. 1975 జూన్ 25 ప్రపంచంలోనే ప్రజాసౌమ్యాన్ని పరిహాసం చేస్తూ అత్యవసర పరిస్థితిని విధించారు.. ఇప్పుడు ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ప్రజలందరికి ఆనాటి అత్యవసర పరిస్థితి తెలియచేయాలని ఈ కార్యక్రమం చేయటం జరుగుతుందన్నారు.. ప్రజల ప్రాధమిక హక్కులని కాలరాశారు.. అలహాబాద్ హైకోర్టులో ఎన్నిక చెల్లదు అని తీర్పు ఇచ్చారు.. ప్రజాసౌమ్యంపై నమ్మకం ఉంటే మళ్లీ ఎన్నికలకి వెళ్లి గెలిచి చూపించవచ్చు.. కానీ, అహంకార ధోరణితో అత్యవసర పరిస్థితి విధించి ఎంతో విధ్వంసం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు..
జగన్ పర్యటనలో రాజకీయ కుట్ర కోణం..!
జగన్ పర్యటన రాజకీయ కుట్ర కోణంగా ఉంది అనే అనుమానం వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ తీరు దారుణంగా ఉంది. హింసని ప్రేరేపించే విధంగా ఉంది జగన్ తీరు ఉంది. సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలు తీసేవిధంగా ఉందని విమర్శించారు.. పొదిలి పర్యటనలో మహిళలు, పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. రెంటపాళ్లలో 100 మందితో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. జగన్ పర్యటనకి కావాల్సిన భధ్రత ఇచ్చాం. కానీ, జగన్ పర్యటన రాజకీయ కుట్ర కోణంగా ఉందన్నారు.. బెట్టింగ్ కి పాల్పడే వ్యక్తి కి విగ్రహం కట్టడం ప్రపంచంలో ఇదే ప్రథమం అని ఎద్దేవా చేసిన ఆయన.. జగన్ మాటలు నమ్మే బెట్టింగ్ కాశారు. చనిపోయి సంవత్సరం దాటిన తరువాత పరామర్శకి వెళ్ళారు. రెంటపాళ్ళలో జగన్ పరామర్శకి కాదు… దండ యాత్ర కి వెళ్ళారు. రప్పా.. రప్పా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారని మండిపడ్డారు.
ప్రజల జోలికి వస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.. మంత్రి వార్నింగ్..
వైసీపీ నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి మాటలు విని ప్రజల జోలికి వస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అంటూ వార్నింగ్ ఇచ్చారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అశాంతి నెలకొల్పేందుకు రెచ్చగొట్టే కార్యక్రమాన్ని నిర్వహించే వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.. వైసీపీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో మందీమార్బలంతో వెళ్లి అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.. విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో 75 ఏళ్ల వయసులో 12 రోజులు ప్రజల మధ్యనే ఉండి ఆదుకున్న నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు… వరద కష్టాలు తెలిసిన ప్రజలను పరామర్శించకుండా బెంగళూరుకు పారిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు.. ఇప్పుడు కార్యకర్త చనిపోయారని సాకు పెట్టుకుని ప్రజలలో దండయాత్రగా వెళ్లి అంతు చూస్తామని సినిమా పోస్టర్లు వేయించుకుంటున్నాడు… ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని మండిపడ్డారు.
క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు.. కోచ్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్
స్పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఇండియా క్రీడాకారిణులను లైంగిక వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కోచ్ వినాయక ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు ఏలూరు పోలీసులు.. కొద్దిరోజుల క్రితం కోచ్ వినాయక ప్రసాద్ పై ఫిర్యాదు చేశారు వెయిలిఫ్టింగ్ క్రీడాకారిణులు.. బాలికల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన బెంగుళూరు నుంచి వచ్చిన శాయ్ సభ్యులు.. లైంగిక వేధింపులు నిజమేనని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఇక, పోక్సోకేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుడు వినాయక ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు.. మరోవైపు, స్పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఇండియా క్రీడాకారిణులను లైంగిక వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కోచ్ వినాయక ప్రసాద్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. బాలికలపై లైంగిక వేధింపులు నిజమేనని తేలడంతో మొదట పోలీసులకు ఫిర్యాదు చేశారు S.A.I సభ్యులు.. దీంతో, పోక్సో కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ చేపట్టారు.. నిందితుడు వినాయక ప్రసాద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు..
ఐఏఎస్ అధికారులు వారానికి రెండు పాఠశాలలను సందర్శించాలి..
తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని సీఎం సూచించారు. విద్యా శాఖపై ఐసీసీసీలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 48 వేల మంది చేరారని అధికారులు సీఎంకు వివరించారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన గదులు నిర్మించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అవసరమైన వసతులను పాఠశాలల్లో కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించి గ్యాస్, కట్టెల పొయ్యిల బాధల నుంచి మధ్యాహ్న భోజనం తయారు చేసే మహిళలకు విముక్తి కల్పించాలని… సోలార్ కిచెన్లు ఏర్పాటుపై తక్షణమే దృష్టి సారించాలని రేవంత్ రెడ్డి అధికారులకు తెలియజేశారు. పదో తరగతిలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్యకు, ఇంటర్మీడియట్‌లో నమోదు అవుతున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉండడంపై సీఎం అధికారులను ప్రశ్నించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులంతా కచ్చితంగా ఇంటర్మీడియట్‌లో చేరేలా చూడాలని సీఎం సూచించారు. ఇంటర్మీడియట్ అనంతరం జీవనోపాధికి అవసరమైన స్కిల్డ్ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చని.. తద్వారా వారి జీవితానికి ఢోకా ఉండదని సీఎం అభిప్రాయపడ్డారు.
పొలంలో రహస్యంగా కలిసిన ప్రేమికులను రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న గ్రామస్థులు.. కట్‌చేస్తే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని ఓ గ్రామంలో ప్రేమ జంట పొలంలో రహస్యంగా కలుసుకున్నారు. వాళ్లను గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సమీపంలోని ఆలయంలో ఇద్దరికీ వివాహం చేశారు. ఆ తర్వాత నవ వరుడి వెంట.. వధువును పంపించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయం ఇద్దరి కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. ఫతేహాబాద్‌లోని పాల్తువా పురా గ్రామానికి చెందిన లక్ష్మణ్ సింగ్ (22), షాబెద్ గ్రామానికి చెందిన ప్రీతి (20) ప్రేమించుకున్నారు. లక్ష్మణ్ ఓ మొబైల్ దుకాణంలో పనిచేస్తుండగా, ప్రీతి బిఎస్సీ పూర్తి చేసింది. దాదాపు ఏడాది కిందట.. ప్రీతి తన మొబైల్ డిస్‌ప్లేను రిపేర్ చేయించడానికి లక్ష్మణ్ దుకాణానికి వెళ్ళింది. ఇక్కడే ఇద్దరి మధ్య సంభాషణ ప్రారంభమైంది. వారి స్నేహం క్రమ క్రమంగా ప్రేమగా మారింది. ఇంతలో మంగళవారం ప్రతీ ప్రియుడిని తన గ్రామానికి ఆహ్వానించింది.
20 ఏళ్లుగా స్కూల్‌లో హిందువులు, ముస్లింలకు వేర్వేరు భోజనం.. చివరకు ఈ విధానం రద్దు..
పశ్చిమ బెంగాల్‌లో గత 20 ఏళ్లుగా ప్రభుత్వం నిర్వహణలోని ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న ఆచారానికి స్వస్తి పలికారు. రెండు దశాబ్దాల తర్వాత హిందూ, ముస్లిం విద్యార్థులు తొలిసారిగా కలిసి బుధవారం మధ్యాహ్న భోజనం చేశారు. వివిధ మతాల విద్యార్థులకు వేర్వేరు భోజనం వడ్డిస్తున్న ఏళ్ల తరబడి ఆచారంపై విమర్శలు రావడంతో ఈ విధానాన్ని రద్దు చేసింది. రెండు దశాబ్దాలుగా హిందూ, ముస్లిం విద్యార్థులు విడివిడిగా మధ్యాహ్న భోజనం అనే విధానం సోషల్ మీడియాలో విస్తృత ఆగ్రహానికి దారి తీసింది. మీడియా కూడా ఈ వార్తను హైలెట్ చేయడంతో బుధవారం ఈ పద్ధతికి స్వస్తి చెప్పారు. ఈ సంఘటన బెంగాల్‌లోని పూర్బ బర్ధమాన్ జిల్లాలోని నాదన్ ఘాట్ ప్రాంతంలోని కిషోరిగంజ్ మన్మోహన్ పూర్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. విద్యార్థుల మధ్య విభజనకు దారి తీసే ఈ ఆచారంపై పాఠశాల అధికారులు ఈ వారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వివక్షతో కూడిన ఆచారాన్ని ముగించాలని ఏకగ్రీవంగా అంగీకరించారు. భోజనం విషయంలో వేర్వేరుగా ఉంటున్నా, విద్యార్థులు అంతా కలిసి క్లాసులకు హాజరవుతారు. ఒకే బెంచీపై కూర్చొంటారు.
అమితాబ్ బచ్చన్ ను డైరెక్ట్ చేస్తా.. విష్ణు కామెంట్స్..
మంచు విష్ణు కన్నప్ప మూవీ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా నా లైఫ్ లోనే అత్యంత కీలకం. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే కన్నప్ప మరో ఎత్తు. దీన్ని డబ్బుల కోసమో, ఫేమ్ కోసమే తీయలేదు. కన్నప్ప గురించి ప్రజలకు తెలియాలి అనే తీశాను. ఈ సినిమాలో నేను కూడా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేశాను. ఒకవేళ నేను డైరెక్టర్ కావాల్సి వస్తే నా ఫస్ట్ సినిమా అమితాబ్ బచ్చన్ గారితోనే చేస్తాను. ఆయన పనితీరును ఇండియా మొత్తం మెచ్చుకుంటుంది. ఆయనతో చేయడం నా కల. నేను నటుడిగా మరిన్ని విభిన్న పాత్రలు చేయాలని అనుకుంటున్నాను. గతంలో ఏం చేశానో ఇప్పుడు ఏం చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంది. ఇప్పటి వరకు మీరు చూడని విష్ణును కన్నప్ప సినిమాలో చూస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు మంచు విష్ణు.
కన్నప్ప టీమ్ పై జీఎస్టీ సోదాలు.. మంచు విష్ణు సహా..
కన్నప్ప మూవీ విషయంలో అధికారులు జీఎస్టీ సోదాలు నిర్వహిస్తున్నారు. మంచు విష్ణు ఆఫీసు, ఇల్లు సహా, మూవీకి చెందిన పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. మూవీ బడ్జెట్ విషయంలో జీఎస్టీ సరిగ్గా చెల్లించారా లేదా అనే విషయాలను పరిశీలిస్తున్నారు. దీనిపై మూవీ టీమ్ ఇంకా ఏమీ స్పందించలేదు. అయితే రీసెంట్ గా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మూవీ బడ్జెట్ గురించి చెబితే అధికారులు తన ఇంటి ముందు క్యూ కడుతారని చెప్పాడు. ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆయన అన్నట్టే ఇప్పుడు అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అనే విషయం మాత్రం ఇంకా బయటకు చెప్పలేదు. మూవీ మరో రెండు రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ సమయంలో సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారిపోయింది.
ఎక్కడెక్కడ అప్పులు చేశానో వాళ్లకు తెలుస్తుంది.. జీఎస్టీ సోదాలపై విష్ణు..
మంచు విష్ణు కన్నప్ప మూవీ టీమ్ పై జీఎస్టీ సోదాలు నిర్వహించారు అధికారులు. మాదాపూర్ లోని విష్ణు ఆఫీసులో, మూవీకి చెందిన పలువురి ఆఫీసుల్లోనూ సోదాలు నిర్వహించారు. మూవీ బడ్జెట్ విషయంలో జీఎస్టీ, ట్యాక్స్ ఎగ్గొట్టనట్టు ఆరోపణలు రావడంతో ఈ సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సోదాలపై మీడియా రిపోర్టర్లు ప్రశ్నించగా తాజాగా మంచు విష్ణు స్పందించారు. ‘సోదాలు చేస్తున్నట్టు మీరు చెప్పేదాకా నాకు తెలియదు. ఎల్లుండి కన్నప్ప రిలీజ్ ఉంది. ఆ బిజీలోనే ఉన్నాను. చేయనివ్వండి. దాచుకునేది ఏమీ లేదు. ఎక్కడెక్కడ అప్పులు చేశానో వాళ్లకు కూడా తెలుస్తుంది’ అంటూ నవ్వేశాడు. ఇక మూవీ అద్భుతంగా వచ్చిందని ఔట్ పుట్ చూసిన వాళ్లు చెబుతున్నట్టు విష్ణు కామెంట్ చేశాడు. సినిమా అందరికీ నచ్చుతుందని.. చివరి గంట సేపు అందరికీ గూస్ బంప్స్ వస్తున్నట్టు చూసిన వాళ్లే చెబుతున్నారని వివరించాడు మంచు విష్ణు.