Konidela Village: చాలా మంది ఇంటి పేర్లతో ఊర్లు ఉంటాయి.. అసలు, ఊర్ల పేర్లను బట్టే.. ఇంటి పేర్లను కూడా పిలిచేవారని చెబుతారు.. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్.. ఇంటి పేరుతో ఓ గ్రామం ఉంది.. ఆ గ్రామానికి భారీ విరాళాన్ని ప్రకటించడమే కాదు.. ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.. ఇక, అసలు విషానికి వస్తే.. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో కొణిదెల అనే గ్రామం ఉంది.. ఆ గ్రామంలో తాగునీటి ట్యాంకు నిర్మాణానికి పవన్ కల్యాణ్ ట్రస్టు ద్వారా 50 లక్షల రూపాయలు ఇచ్చారు.. ఎన్నికలకు ముందు నియోజకవర్గ పర్యటనలో పవన్ కల్యాణ్ కొణిదెల గ్రామాన్ని సందర్శించినప్పుడు తన ఇంటిపేరుతో ఊరు ఉందన్న విషయం తనకు తెలియదని.. తాము అధికారంలోకి వస్తే ఈ కొణిదేల గ్రామాన్ని దత్తాతకు తీసుకుంటానని హామీ ఇచ్చారు..
Read Also: Hyderabad: ముదిరిన రీల్స్ పిచ్చి..ఫేమస్ కావడం కోసం రైల్వే ట్రాక్‌పై వేగంగా కారు నడుపుతూ…
ఇక, ఇచ్చిన హామీలో భాగంగా మొదటిసారిగా గ్రామంలో నీటి కొరత ఉందని స్థానిక ఎమ్మెల్యే జయసూర్య డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకు పోవడంతో.. అందుకు స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 50 లక్షల రూపాయలను తమ ట్రస్టు ద్వారా విడుదల చేస్తున్నామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నారు. దీంతో, ఈరోజు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, నందికొట్కూరు ఎమ్మెల్యే జయ సూర్య, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్.. కొణిదెల గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన సాయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు కొణిదెల గ్రామస్తులు..