టిడ్కో ఇళ్లపై లబ్ధిదారులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మాట్లాడుతూ.. లబ్ధిదారులకు దీపావళి నాటికి టిడ్కో ఇళ్లు అందజేస్తామని వెల్లడించారు.. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు వచ్చినా.. ఉన్నా.. ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నాం అని తెలిపారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనే కాదు.... మొత్తం ఏపీ పాలిటిక్స్‌లో పరిచయం అక్కరలేని పేరు ధర్మాన ప్రసారావు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేశారాయన. కాంగ్రెస్, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీల్లో తనదైన మార్క్ రాజకీయాలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మంత్రి పదవిలో ఉన్న ధర్మాన... ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. ఏడాదిగా బయట ఎక్కడా కనిపించడం లేదాయన.
మరోసారి తెలంగాణలో ఆంధ్రా బిర్యానీని ఉడికించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా ప్రాంత వంటకాలను, అలవాట్లను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎండార్స్ చేస్తూ కవిత తాజాగా వ్యాఖ్యలు చేయడం కొత్త చర్చకు దారితీసింది. ఉద్యమకారులను ఉద్దేశించి ఆనాడు కేసీఆర్ మాట్లాడుతూ... ఆంధ్రా ప్రాంతంలో వండే బిర్యానీని పేడతో పోల్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో కేసీఆర్ మాటల్ని ఆంధ్రా ప్రాంత ప్రజలు, నేతలు తీవ్రంగా నిరసించారు. సోషల్ మీడి
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది.. లిక్కర్ స్కాం కేసులో నిందితుల విదేశీ పర్యటనలపై సిట్ ఫోకస్ పెట్టింది. స్కాంలో ముడుపులకు సంబంధించి వసూలు చేసిన డబ్బును షెల్ కంపెనీల ద్వారా వేర్వేరు దేశాలు కూడా హవాలా మార్గంలో మళ్లించారని ఇప్పటికే అనుమానిస్తున్న నేపథ్యంలో నిందితుల విదేశీ పర్యటనలకు సంబంధించిన వివరాలను సిట్ సేకరిస్తోంది..
ఏపీలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలన, అప్రజాస్వామిక విధానాలు, కక్షసాధింపులో భాగంగా అక్రమ కేసుల బనాయింపు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు భద్రత కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ.. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది వైసీపీ ప్రతినిధుల బృందం..
అనేక సందర్భాల్లో సినీ హీరోలను టార్గెట్ చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ.. ఇప్పుడు మరోసారి స్టార్ హీరోలు, హీరోయిన్స్‌పై విమర్శలు గుప్పించారు.. పాన్ మసాలా కొనమని స్టార్ హీరోలు, హీరోయిన్స్ ప్రచారం కల్పించడం బాధాకరమన్న ఆయన.. పాన్ మసాలా తయారీ కేంద్రాలను గుర్తించి సీజ్ చేయాలని సూచించారు..
గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నా.. ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోవడమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.. నేను యువతకు ఒకటే చెబుతున్నా. ఎన్నికలకు ముందు కూడా చెప్పాను. రౌడీల తోక కత్తిరిస్తానని అన్నాను. రాయలసీమలో ముఠా కక్షలు. కుటుంబాలకు కుటుంబాలను చంపే పరిస్థితి. రాయలసీమలో ముఠాకక్షలను పూర్తిగా అణిచివేశాం. మతసామరస్యాన్ని కాపాడుతాం... విద్వేషాలు రెచ్చగొట్టే…
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో కర్నూలు పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితునికి 20 ఏళ్ల జైలు శిక్ష , 50 వేల రూపాయల జరిమానా విధించింది పోక్సో కోర్టు..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయేషా మీరా తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు.. ఆయేషా మీరా హత్యపై సీబీఐ ఏం విచారణ చేసిందో తుది నివేదిక పరిశీలించాలని.. ఆ పిటిషన్లో హైకోర్టుకు విన్నవించారు ఆయేషా తల్లి శంషాద్ బేగం.. అదే విధంగా సీబీఐ విచారణ తుది నివేదికను ఆయేషా మీరా తల్లిదండ్రులకు ఇచ్చేలా సీబీఐని ఆదేశించాలని కూడా పిటిషన్లో పేర్కొన్నారు.