సర్క్యులర్ ఎకానమీపై సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.. సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 11 రంగాలపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టింది.. రాష్ట్రంలో ‘సర్క్యులర్ ఎకానమీ పార్కులు’ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వెల్లడించారు..
2024 అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ పేరిట భారీ మార్పులు.. చేర్పులు చేసి చేతులు కాల్చుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 80 అసెంబ్లీ సీట్లతోపాటు పలు లోక్సభ నియోజకవర్గాల్లో కూడా ఇన్స్టంట్ కాఫీలాగా... ఇన్స్టంట్ మార్పులు చేసేసి చివరికి 11 సీట్లకు పరిమితమైంది.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. పల్నాడు జిల్లా మాచర్ల నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మొదట కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినా... వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ చెంత చేరారాయన. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి మాటకు తిరుగులేదన్నట్టుగా ఉండేది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి చేతిలో ఓడిపోయారు పిన్నెల్లి.
అపోజిషన్ లో ఉండి రౌడీయిజం చేస్తానంటే ఇక్కడ ఉంది సీబీఎన్.. రౌడీయిజం చేస్తాం, రుబాబు చేస్తాం, పోలీసుల మీద దాడి చేస్తానంటే నోరు మూయించే శక్తి టీడీపీకి ఉంది అని తేల్చి చెప్పారు. 1996-97లో తీవ్రవాద సమస్య, రాయలసీమలో ఫ్యాక్షన్, హైదరాబాద్ లో మత ఘర్షణలు, గల్లీకొక రౌడీ ఉంటే.. అన్నింటినీ అరికట్టాను.. పులివెందుల మార్క్ రాజకీయం చేస్తానంటే తోక కట్ చేస్తాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.
JC Prabhakar Reddy: చంద్రబాబు అతి మంచితనం వల్లనే ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్లపై తిరుగుతున్నారు అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మా చేతులను కట్టేశారు.. రాష్ట్రంలో వైసీపీ నేతలు ఏం మాట్లాడినా రాష్ట్రాభివృద్ధి కావాలనే ఆలోచనతో చంద్రబాబు ఇవన్నీ పట్టించుకోవడం లేదు..
Vellampalli Srinivas: జగన్ అంటే నమ్మకం- చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం గడుస్తున్న ప్రభుత్వం చేసిన తప్పుడు వాగ్దానాలు ప్రజలకు తెలిసే విధంగా పుస్తకాన్ని ఏర్పాటు చేశాం అన్నారు.
Perni Nani: మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. ఓ కేసు విషయంలో మచిలీపట్నం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2019లో టీడీపీ కార్యకర్త చందు, శ్రీహర్షలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ కేసులో సాక్షిగా పేర్నినాని ఉన్నారు.
Piyush Goyal: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కృష్ణపట్నం పర్యటన రద్దైంది. తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కిన తర్వాత అందులో సాంకేతిక లోపం ఉన్నట్లు తేలడంతో పర్యటనను రద్దు చేసుకున్నారు.