ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ నాని అన్ని జిల్లాల డిఎంహెచ్వో లతో టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. కరోనా కేసులు అధికంగా ఉన్న కృష్ణా, గుంటూరు, విశాఖ, నెల్లూరు, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. రానున్న ఆరువారాల్లో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించడంతో కేసులు ఎక్కువ ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. వైరస్ వ్యాప్తి గతానికంటే వేగంగా ఉందని, ఆసుపత్రుల్లో బెడ్స్ ను…
విశాఖపట్నంలోని మధురవాడలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ఆదిత్య ఫార్చూన్ టవర్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆదిత్య ఫార్చూన్ టవర్ లోని ప్లాట్ నెంబర్ 505 లో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. మృతులు బంగారునాయుడు, నిర్మల, దీపక్, కశ్యప్ లుగా గుర్తించారు. అయితే, ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఉండటంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు…
వాలాంటీర్లకు సత్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి హాట్ కామెంట్స్ చేశారు. పలువరు వాలంటీర్లపై బహిరంగంగా అసహనం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో వైసీపీకి, జగన్ కు వ్యతిరేకంగా బహిరంగంగా ప్రచారం చేస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. కురుపాం మండలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని, గరుగుబిల్లి మండలంలో ఒక వాలంటీర్ భర్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశారని…
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతున్నది. ఉప ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం తిరుపతిలోనే ఉంది పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం నిర్వహిస్తున్నాయి. నారా లోకేష్ విన్నూతంగా ప్రచారం చేస్తున్నాడు. తాజాగా అలిపిరిలో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలిపిరిలో నారా లోకేష్ ప్రమాణం చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని నారా లోకేష్ ప్రమాణం చేశారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ… తమ…
ప్రేమ వివాహం రెండు వర్గాల మధ్య గొడవ రేకెత్తించింది. .రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు పిడకలతో విసురుకుంటూ దాడి చేసుకుంటారు. దాడి చేసుకున్న అనంతరం రెండు వర్గాలు అన్నదమ్ములు లా కలిసిపోయి ఆ ప్రేమ వివాహాన్ని జరిపిస్తారు .ఇలాంటి విచిత్ర వివాహం చూడాలంటే మనం కర్నూలు జిల్లా వెళ్లాల్సిందే. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామం లో ఉగాది పండుగ మరుసటి రోజున పిడకల సమరం ఆడడం దశాబ్దాల కాలం నుండి ఆనవాయితీగా వచ్చింది. పూర్వం…
ప్రకాశం జిల్లాలో నాటు బాంబు పేలుడు కలకలం రేకెత్తించింది. కంభం లోని ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలో ఓ ఇంటి వద్ద దాచి ఉంచిన నాటు బాంబుని ఓ కుక్క కొరకడంతో ఒక్కసారిగా పేలింది. బాంబు పేలుడు ధాటికి కుక్క తల మొత్తం చిధ్రమైపోయింది. భారీ శబ్దంతో బాంబు పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కంభం ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలో ఉంటున్న రమేష్ అనే వ్యక్తి ఇంటి…
కరోనా వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ దేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసింది. భారత్ లో ఇప్పటికే మూడు టీకాలు అనుమతులు పొందాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ జాబితాలో ఉన్న అమెరికా ఎఫ్డీఏ, ఈఎంఏ, బ్రిటన్ ఎంహెచ్ఆర్ఏ, పీఎండీఏ జపాన్ వంటి విదేశీ ఔషధ నియంత్రణ సంస్థలు ఇప్పటికే పలు టీకాలకు ఆమోదం తెలిపాయి. విదేశాల్లో అనుమతి పొందిన వ్యాక్సిన్ లకు అనుమతి ఇచ్చేందుకు వ్యాక్సిన్లపై ఏర్పాటు…
దుర్గగుడిలో వెండి రథంలో మిస్సయిన నాలుగు సింహాలు అమర్చినందుకు గాను సాయంత్రం రథోత్సవానికి లైన్ క్లియర్ అయింది. వెండి రథంలో నాలుగు సింహాలు కొత్తవి అమర్చారు దుర్గగుడి అధికారులు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో వెండి రథంలో మూడు సింహాలు చోరీకి గురైన సంగతి తెలిసిందే. నాలుగో సింహం చోరీకి యత్నించి విఫలం అయ్యారు దుండగులు. ప్రస్తుతం నాలుగు సింహాలు వెండి రథంలో యధాస్థానంలో తిరిగి దుర్గగుడి అధికారులు నిర్మించారు. భక్తుల నుంచి విమర్శలు రావడంతో హైదరాబాద్…
బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నాయకులు నుంచి చిన్న కార్యకర్త వరకు అందరూ టీడీపీలో అందరూ జూనియర్ ఎన్టీఆర్ రావాలని డిమాండ్ చేస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. తండ్రి గా చంద్రబాబు విఫలమయ్యారు…కొడుక్కి రాజకీయాలే కాదు కనీసం సంస్కారం కూడా నేర్పించలేకపోయారని అన్నారు. బీజేపీ మత విద్వేషాలను ఎజెండాగా తీసుకుని భయభ్రాంతులకు గురి చేస్తోందని ఏం చేశారని తిరుపతి ఓటర్లు మీకు ఓటెయ్యాలి? అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ స్వార్ధాన్ని కూడా పక్కన పెట్టి జగన్…
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూస్తే.. దేశంలోని ప్రజలంతా జగన్ ప్రధాని కావాలని కోరుకుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి.. పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో వాలంటీర్లకు సత్కార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేవారు.. వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి దేశంలోని పేదలందరూ జగన్ ప్రధాని కావాలని కోరుకుంటారని పార్థసారథి వ్యాఖ్యానించగా… అక్కడున్న వాలంటీర్లు, అభిమానులు కేకలు…