తిరుపతిలో హోరాహోరీగా ప్రచారం చేసిన ప్రధాన పార్టీల నాయకులు సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయారు. కరోనా వైరస్‌కు హాట్‌స్పాట్‌గా ఉన్న ప్రదేశాల నుంచి వారంతా రిటర్న్ కావడంతో కొత్త టెన్షన్ నెలకొంది. వైద్యశాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇళ్లకు చేరుకున్నవారు జనాల్లోకి వెళ్లకుండా క్వారంటైన్లో ఉంటే బెటర్ అనే చెబుతున్నారు. అది సాధ్యమయ్యే పనేనా? తిరుపతి నుంచి సొంతూళ్లకు నేతలు, కార్యకర్తలు రిటర్న్! ఏపీలో పెద్దఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందల నుంచి వేల సంఖ్యకు కరోనా…
కరోనా రాకముందు నిర్లక్ష్యం. కరోనా వచ్చిన తరవాత దారుణం. ఇప్పుడు ఇదే పరిస్థితి… దేశంలోనూ రెండు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఒక్కో వ్యక్తి నుంచి ఎంత మందికి వైరస్ సోకుతుందో తెలియడం లేదు. నిర్లక్ష్యంగా జనంతో కలిసి తిరుగుతున్న కరోనా బాధితులు! కరోనా మొదటి వేవ్ జనాలను ఊచకోత కోసింది. సెకండ్ వేవ్ ఉధృతంగా చొచ్చుకెళ్తోంది. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా తేలిగ్గా తీసుకుంటున్నారు జనాలు. కేసులు విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణం చాలామంది కరోనా వచ్చిన వాళ్ళు…
కరోనా మహమ్మారి విజృంభణతో యావత్ దేశం మరోసారి చిగురుటాకులా వణుకుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు, మరణాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వరుసగా రెండో రోజు 2 లక్షలకు పైగా కొత్త కేసులు, వెయ్యికి పైగా మరణాలు నమోదవడం కొవిడ్ తీవ్రతను కళ్లకు కడుతోంది. తొలుత ఈ రెండో దశ ఉద్ధృతి మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉండగా.. ఇప్పుడు చాపకింద నీరులా దేశమంతా వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ మొత్తం కేసుల్లో సగం.. కేవలం మూడు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. మహారాష్ట్ర,…
తెలుగు రాష్ట్రాల్లో మరికాసేపట్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుండగా, తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉపఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల కోసం అన్ని పార్టీలు ప్రచారం నిర్వహించాయి. అన్ని పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతి నియోజక వర్గంలో త్రిముఖ పోటీ నెలకొన్నది. అధికార వైసీపీ సిట్టింగ్ స్థానం కావడంతో గెలుపుపై ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నది. అదే విధంగా తప్పకుండా తామే గెలుస్తామని…
ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిస్సా తీరము మరియు దాని పరిసర ప్రాంతాలలో 0.9 km ఎత్తు వరకు ఏర్పడింది. కేరళ తీరప్రాంతానికి దగ్గరలోని ఆగ్నేయ అరేబియా సముద్రము నుండి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 km ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి / విండ్ డిస్కంటిన్యుటి బలహీనపడింది. ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి విద్యార్థులకు, యువతకు ఎక్కువగా సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. స్కూల్స్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా విజయవాడ పడమటలోని కోనేరు బసవయ్య చౌదరి స్కూల్ లో కరోనా కలకలం రేగింది. టీచర్ కు కరోనా పాజిటివ్ రావడంతో యాజమాన్యం మూడురోజులపాటు సెలవు ప్రకటించింది. పాఠశాలలో మొత్తం 1300 విద్యార్థులు, 40 మంది టీచర్లు ఉన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన టీచర్…
మాయదారి మహమ్మారి కరోనాకు చెక్ పెట్టడానికి ఉన్న ఒకే ఒక మర్గం వ్యాక్సినేషన్.. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ఆగిపోయే పరిస్థితి నెలకొంది.. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఉన్న మొత్తం వ్యాక్సినేషన్‌ను పంపిణీ చేశారు వైద్య సిబ్బంది.. దీంతో.. కేంద్రం వ్యాక్సిన్ డోసులు పంపేవరకు వేచిచూడాల్సిన పరిస్థతి. ఇటీవలే కేంద్రం నుంచి వచ్చిన 6 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు సిబ్బంది.. దీంతో.. ఏపీలో జీరోకు పడిపోయాయి వ్యాక్సిన్ నిల్వలు.. మరోవైపు.. మరిన్ని డోసులు కావాలంటూ…
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, సీఎం వైఎస్ జగన్‌కు కొత్త పేరు పెట్టారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ రెడ్డి పేరు ఇక నుంచి జాంబీ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు.. సీఎం కుర్చీలో ఉన్నవారికి సంక్షేమం, అభివృద్ధి చేస్తే ఆనందం వస్తుంది.. కానీ, జాంబీ రెడ్డి.. టిడిపి నేతలు, కార్యకర్తల అరెస్టులతో ఆనందిస్తున్నారని మండిపడ్డారు..…
కరోనా సెకండ్ వేవ్‌లో భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంతో.. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.. దీంతో.. ఆస్పత్రుల్లో బెడ్స్ లేని పరిస్థితి వచ్చింది.. ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఇబ్బంది పెడుతుందన్న వార్తల నేపథ్యంలో.. ఆ బెడ్ల కొరతపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రభుత్వాస్పత్రుల్లో వీలైనన్ని ఎక్కువ బెడ్లను ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేసింది ప్రభుత్వం.. బెడ్ల కొరతతో కరోనా బాధితులు అల్లాడిపోతుండడంతో.. అసలు ఉన్న బెడ్లు…