ఏపీలో రోజువారీ కరోనా కేసులు 12 వేలు దాటేశాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 12,634 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1033560 కు చేరింది. అందులో 936143 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 89732 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 69 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు…
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మరియు ఎల్లుండి ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు ఉరుములు, మెరుపులు…
కరోనా వ్యథలు అన్నీ ఇన్ని కాకుండా పోయాయి.. కరోనా బారినపడిన ఆస్పత్రులకు వెళ్తే.. తిరిగి వస్తారా? అని గ్యారేంటి లేని పరిస్థితి.. ఇక, విశాఖలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.. కేజీహెచ్ సి ఎస్ ఆర్ బ్లాక్ వద్ద కరోనా పేషెంట్లు, బంధువులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు వచ్చాయి.. గంటల తరబడి బెడ్స్ కోసం వేచివుంటున్నా వైనం ఎక్కడచూసినా కనిపిస్తోంది.. బెడ్స్ లేక ఆసుపత్రి ఆవరణలోనే ప్రాణాలు కోల్పోతున్నారు కరోనా రోగులు… కరోనా పేషెంట్లకు సరిగ్గా…
ఏపీలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 1600 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించనుంది అని ఆళ్ళ నాని తెలిపారు. అలాగే రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే పూర్తి స్థాయి సామర్థ్యం వరకు కరోనా పరీక్షలు చేపట్టాలని నిర్ణయించాం అని పేర్కొన్నారు. అలాగే…
ఏపీలో కరోనా సెకండ్‌వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. రోజురోజుకీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. పది వేలకు చేరువయ్యాయి రోజువారి పాజిటివ్ కేసులు.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 39,619 సాంపిల్స్ పరీక్షిం చగా 9,716 మందికి కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగింది.. 24 గంటల్లోనే కోవిడ్‌తో 38 మంది మృతిచెందడం కలకలం రేపుతోంది.. కోవిడ్…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉదృతి కొనసాగుతోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ఏపీ ప్రభుత్వం స్కూల్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 9 వ తరగతి వరకు స్కూల్స్ కు సెలవలు ప్రకటించింది. అయితే, పదో తరగతి క్లాసులు యధావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొన్నది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కరోనా ఉదృతి సమయంలో టెన్త్ పరీక్షల నిర్వహణ ప్రభుత్వ…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 37,765 సాంపిల్స్ ని పరీక్షించగా.. 5963 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అలాగే ఈ వైరస్ కారణంగా 27 మంది మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 2,569 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారని.. నేటి వరకు రాష్ట్రంలో 1,57,15,757 సాం పిల్స్ ని పరీక్షించామని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 9,68,000 కు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన విడుదల చేసింది అమరావతి వాతావరణ కేంద్రము. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర :ఈరోజు దక్షిణ…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. వివేకా హత్య సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీవీ ఈ కేసు విచారణలో సీబీఐ అచేతనత్వంతో ఉందని.. సీబీఐ విచారణ మొదలై ఏడాది గడిచినా కేసు దర్యాప్తులో పురోగతి లేదని సీబీఐ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే కాగా.. వివేకా హత్యకేసు సమాచారం ఉందని సీబీఐకి రెండుసార్లు తెలిపానని.. అయినా స్పందించలేదని పేర్కొన్నారు..…
మాములు రోజుల్లో ఆదివారం వచ్చింది అంటే నాన్ వెజ్ మార్కెట్లు జనాలతో కిటకిటలాడుతుంటాయి. అయితే, ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుంటున్న నేపథ్యంలో ఆంక్షలను అమలు చేస్తున్నారు. తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఇంకా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నా, మరణాల రేటు పెరుగుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా విజయవాడ, కడప జిల్లాల్లో పరిస్థితులు దారుణంగాఉన్నాయి . మాస్క్…