సీపీఎం పార్టీ సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే కుంజా బుజ్జి అనారోగ్య కారణాలతో అస్తమించారు.. అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతోన్న ఆయన గత నెల తీవ్ర అస్వస్థతకు గురికాగా.. భద్రాచలం పరిధిలో గల ప్రభా శంకర్ ఆస్పతిలో చేర్పించారు.. ఆయన వయస్సు 95 ఏళ్లు.. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎన్నికయ్యారు.. నేటి తరానికి ఆదర్శ నేతగా.. నిజాయితీకి ప్రతిరూపంగా బతికిన ఆయనకు ఇప్పటికీ సొంత ఇల్లు కూడా లేదు.. ప్రజలే నా…
శిల్పారామాల ద్వారా ఆదాయ సముపార్జనకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది ఏపీ టూరిజం. స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ అధ్యక్షతన జరిగిన శిల్పారామాల ఎగ్జిక్యూటీవ్ బాడీ సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. ఆదాయ సముపార్జనకు ఖాళీగా ఉన్న శిల్పారామాల భూముల వినియోగానికి కసరత్తులు చేస్తున్నారు. శిల్పారామాల భూముల్లో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, స్పోర్ట్సు కాంప్లెక్సుల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. పీపీపీ పద్ధతిలో గుంటూరు, కాకినాడ, కడప, అనంతపురంలో శిల్పారామాల్లో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, స్పోర్ట్సు కాంపెక్సుల నిర్మాణాలకు ఎగ్జిక్యూటివ్…
పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. దీంతో ఏమి చేయాలో తెలియక ఎన్నికల అధికారులు టెన్షన్ పడుతున్నారు. అసలు విషయానికి వస్తే పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులు ఉన్నాయి. ఇందులో ఒక వార్డు ఏకగ్రీవమైంది. 4 వ వార్డు మీసాల సురేష్ – వైసీపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే 8వ వార్డు పిచ్చుక అజయ్ కుమార్ ఏకగ్రీవం విషయంలో టెన్షన్ నెలకొంది. అదేంటంటే ఈ 8వ వార్డు డమ్మీ…
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. వచ్చే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో చంద్రబాబుకు భంగపాటు తప్పదని పేర్కొన్నారు. “వైజాగ్ స్టీల్ పై ప్రధానికి రాసిన లేఖతో, తను గోబెల్స్ ప్రచారాలకు పాల్పడ్డట్టు చంద్రబాబు అంగీకరించాడు. జగన్ గారి ప్రభుత్వం ప్లాంటును ప్రైవేటు సంస్థలకు అమ్మాలని చూస్తోందని మొన్నటి దాకా దుష్ప్రచారం చేసాడు. కేంద్ర బడ్జెట్ లో ప్రైవేటీకరణను ప్రతిపాదించారని లేఖలో ప్రస్తావించాడు. గుండె దిటవు చేసుకో చంద్రబాబూ. జరగబోయే…
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తరువాత చంద్రబాబు నాయుడు కుప్పం లో పర్యటించబోతున్నారు. కుప్పం నియోజక వర్గంలోని గ్రామ పంచాయతీల్లో అత్యధికభాగం వైసీపి కైవసం చేసుకున్నది. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కుప్పం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి మూడు రోజులపాటు కుప్పంలో పర్యటించబోతున్నారు. కుప్పం నియోజక వర్గంలోని కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు. దిశానిర్దేశం చేసేందుకు బాబు పర్యటించబోతున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు…
ఏపీ ఉద్యోగ సంఘాల మధ్య మళ్లీ గొడవ ప్రారంభమైంది. తమతో కలవకుండా వీఆర్వోలను కొన్ని ఉద్యోగ సంఘాలు అడ్డుకుంటున్నాయంటూ ఏపీ జేఏసీ అమరావతి సంఘం ఛైర్మన్ బొప్పరాజు విమర్శలు గుప్పించారు. పరోక్షంగా ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి పై బొప్పరాజు ఆరోపణలు చేసారు. ఆయన మాట్లాడుతూ… వీఆర్వో సంఘాలు మా ఏపీ జేఏసీతో కలవడం కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులకి ఇష్టం లేదు. అందుకే వీఆర్వో సంఘాల నేతలపై బెదిరింపులకి పాల్పడుతున్నారు. వీఆర్వోల పై ఏసీబీతో దాడులు…
ఏపీ మంత్రి పేర్ని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దుర్గ గుడి ఉద్యోగుల అవినీతిపై ఏసీబీ దాడులు చేస్తే మంత్రి వెల్లంపల్లిపై ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. అక్రమాలు సహించేదే లేదంటూ ప్రభుత్వమే తనిఖీలు చేయిస్తోందని… దుర్గగుడి ఉద్యోగులపై ఏసీబీ సోదాల విషయంలో రాజకీయ ఆరోపణలు చేయడం దారుణమని మండిపడ్డారు. దుర్గ గుడి ఈవో తప్పు చేశారని.. లెక్క తేలితే బొక్కలు పగులుతాయని హెచ్చరించారు. అవినీతిని ఊపేక్షించే విషయంలో ఈవో లేదు.. డీవో లేదు.. అందరి మీద…