ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూస్తే.. దేశంలోని ప్రజలంతా జగన్ ప్రధాని కావాలని కోరుకుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి.. పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో వాలంటీర్లకు సత్కార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేవారు.. వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి దేశంలోని పేదలందరూ జగన్ ప్రధాని కావాలని కోరుకుంటారని పార్థసారథి వ్యాఖ్యానించగా… అక్కడున్న వాలంటీర్లు, అభిమానులు కేకలు పెద్దగా స్పందించారు.. ఇక, దీనికి ప్రతిస్పందనగా.. చిరునవ్వులు చిందించారు సీఎం వైఎస్ జగన్.
మరోవైపు.. చంద్రబాబు పై సెటైర్లు వేశారు మంత్రి పేర్ని నాని… 2 లక్షల 50 వేల పై చిలుకు వాలంటీర్లను చూసి చంద్రబాబు కుళ్లుకుంటున్నారన్న ఆయన… జగన్ సైన్యం వాలంటీర్ల పని చేస్తున్న దెబ్బకు సర్వర్లు హ్యాంగ్ అయిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.. ఇక, నేకు, పార్థసారథికి గతంలో మంచి స్నేహితులం… ఇప్పుడు జోరు తగ్గిందన్న ఆయన.. తనను, పార్థసారథిని కలుపుతూ పిట్ట కథ కూడా చెప్పారు.. జీతాలు పెంచాలని కొంత మంది వాలంటీర్ల ఆందోళనను పరోక్షంగా ప్రస్తావించారు మంత్రి పేర్ని నాని.